ఏపీ కేబినెట్ తొలి భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇతర శాఖల మంత్రులు హాజరయ్యారు. మూడున్నర గంటల పాటు మంత్రివర్గం సమావేశం కాగా.. పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ క్రమంలో నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 16,347 పోస్టులను డిసెంబర్ 10లోపు భర్తీ చేయాలని నిర్ణయించింది. జులై 1 నుంచి డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై 2 ప్రతిపాదనలపై భేటీలో చర్చించారు. మెగా డీఎస్సీతో పాటు పింఛన్ల పెంపుపైనా కేబినెట్లో చర్చించారు.
పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జరిపిన చర్చల్లో కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై మంత్రి వర్గం చర్చించారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా అధికారులు క్యాబినెట్లో చర్చించారు. జులై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోపు ముగిసేలా ప్రణాళికను రూపొందించారు. ఇక ఈ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించడంతో జులై 1 నుంచి మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభంకానుంది. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడగా.. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా అది వాయిదా పడింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచింది.జులై 1 నుంచి పెంచిన పింఛన్లు అందించనున్నారు.
ఏప్రిల్ నుంచి ఉన్న పింఛన్ బకాయిలతో కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7 వేల పింఛన్ అందనుంది. జులైలో ఒకేసారి 65 లక్షల మంది లబ్ధిదారులు రూ.7 వేల పింఛన్ అందుకోనున్నారు. వారికి ఇంటి వద్దకే పెరిగిన పింఛన్లు అందించనున్నారు.అలాగే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడలో వైఎస్సార్ హెల్త్ వర్శిటీ పేరును ఎన్టీఆర్ వర్శిటీగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 7 అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మైన్, వైన్, పవర్ అండ్ ఫైనాన్స్ వంటి అంశాలపై వైట్ పేపర్ విడుదల చేయనున్నారు. కేబినెట్ ముగిశాక మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పలు అంశాలపై అమాత్యులకు దిశానిర్దేశం చేశారు.
ఇక ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారి కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మూడున్నర గంటలపాటు కొనసాగింది. ఏపీ కేబినెట్ భేటీలో..పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. చంద్రబాబు చేసిన 5 తొలి సంతకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై విడివిడిగా చర్చించిన కేబినెట్.. మెగా DSC, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపింది. అలాగే అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సెస్కు ఓకె చెప్పింది. YSR హెల్త్ వర్సిటీ పేరు NTRహెల్త్ వర్సిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్, ఫైనాన్స్, విద్యుత్‌శాఖలపై శ్వేతపత్రాలు విడుదలచేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఒకటో తేదీన సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేయించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్.