న్యూఢిల్లీ జూలై 27: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం మొదలయింది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించడానికి తగినంత సమయాన్ని కేటాయించకపోవడానికి, సరైన వైఖరి పాటించనందున నిరసనగా ఆమె ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.‘‘ చంద్రబాబు నాయుడుకు మాట్లాడటానికి 20 నిమిషాలు కేటాయించారు. ఇంకా అస్సాం, గోవా ముఖ్యమంత్రులు మాట్లాడటానికి 10 నుంచి 12 నిమిషాలు ఇచ్చారు. కానీ నేను ఐదు నిమిషాలు మాట్లాడక ముందే నన్ను నిలువరించారు. అందుకనే నేను ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాను’’ అని మమతా బెనర్ఝీ వివరించారు.ప్రధాని మోడీ నేతృత్వంలో నేడు రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతోంది. అయితే కేంద్రానికి, ప్రతిపక్ష పాలిత రాష్టాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. కేంద్రం ఏకపక్ష కేటాయింపులు చేసిందంటూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. ఇండియా కూటమికి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ సమవావేశానికి హాజరు కాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సూఖు, కేరళ ముఖ్యమంతిర పినరయి విజయన్ వంటి మహామహులు అంతా ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు.2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న లక్ష్యంతో నేటి నీతి ఆయోగ్ సమావేశం నిర్వహిస్తున్నారు.
Related Articles
ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఎలక్ట్రిక్ స్కూటర్లు వారుగా ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే వరుసపెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు పేలుతూ ఉన్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో […]
శ్రీశైలం జలాశయానికి ఆగిన వరద
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఔట్ ఫ్లో 21,189 క్యూసెక్కులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో శ్రీశైలం జలాశయంలోకి వరద నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఔట్ ఫ్లో మాత్రం 21,189గా ఉంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి […]
వెయ్యి మంది ‘ఈటల’లు వచ్చినా టీఆర్ఎస్ను ఏం చేయలేరు..
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email బీజేపీలో చేరిన మరుక్షణమే ఈటల రాజేందర్ పతనం ప్రారంభమైందయిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన ఈటల.. ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కమలాపూర్ మండలంలోని ఉప్పల్లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్యెల్యే పాల్గొన్నారు. […]