హైదరాబాద్, జూలై 27: అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్తున్న మూడు పథకాలపై విచారణకు సిద్ధమా అని సీఎం సవాల్ విసిరారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పెండింగ్ పడడానికి గత బీఆర్ఎస్ పాలనే కారణమన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూములన్నీ అమ్ముకున్నారని.. కానీ నీళ్లు మాత్రం ఇవ్వలేదన్నారు. పదేళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చాలని చూసింది బీఆర్ఎస్ నాయకత్వమే అని ఆరోపించారు.అప్పుల లెక్కలు గొప్పగా చెప్పిన హరీశ్‌రావు అమ్మకాల లెక్కలు ఎందుకు చెప్పట్లేదని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అఖరికి గొర్రెల పంపిణీ పథకంలోనూ రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. రూ.లక్షల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మారన్నారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారన్నారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.అంతకుముందు శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రూ. 4.5 లక్షలు లేని జీఎస్‌డీపీని.. రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలన బాగా లేదని మాటలు చెబితే సరిపోతుందని, అందుకు ఆధారాలు చూపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Related Articles
గులాబీ వర్సెస్ కాంగ్రెస్
మార్చి 1 నుంచి ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప…
భవిష్యత్తు అంతా ఈ వీలదే
భవిష్యత్తు అంతా ఎలక్ట్రికల్ వాహనాలదేనని రాష్ట్ర ఐటీ శ…
ఎమ్మెల్యే గా నోముల భగత్ ప్రమాణ స్వీకారం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును భగత్ […]