హైదరాబాద్, జూలై 27: పాతబస్తీలో సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింహవాహిని ఆలయంతో పాతబస్తీలోని 28 ప్రధాన దేవాలయాలతో పాటు మరో 330 ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. జూలై 28 ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహిస్తారు. 4 గంటలకు బలిహరణ, 5.30కు దేవీ మహాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాలబండ శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, చార్మినార్ లో శ్రీ భాగ్య లక్ష్మి ఆలయంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, మిరాలం మండి శ్రీ మహంకాళి టెంపుల్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, సబ్జి మండి నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇంకా చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ శ్రీ ఖిలా మైసమ్మ ఆలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, నాచారం ఉప్పల్ శ్రీ మహంకాళి సహిత మహకాళేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.సింహ వాహిని మహంకాళి లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా 2,500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు . పాతబస్తీలో ఫలక్‌నుమా, చార్మినార్, బహుదుర్‌పురా,మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో జూలై 28, 29వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం సోమవారం రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. అక్కన్న మాదన్న ఆలయం నుంచి నయాపూల్ వరకు తెల్లవారుజామునుంతి అర్థరాత్రి వరకూ కొనసాగనున్న ఈ భారీ ర్యాలీలో ఏనుగుపై ఉరేగింపు ఉంటుంది
Related Articles
ప్రచారంలోకి రేవంత్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం ఊపందు…
ట్రాఫిక్... కట్టడి ఎలా...మహానరకం 68 లక్షల 5 వేల 432 వాహానాలు
హైదరాబాద్, ఆగస్టు 1: ఒకప్పుడు ఇంటికో సైకిల్ ఉంటే చాలా గొప్ప.. కనీ ఇప్పుడు కాలం మారింది. దాంతో పాటే అవసరాలు మారాయి. ఇప్పుడు ఇంటికో బైక్, కార్ మస్ట్ అనే ఫీలింగ్‌కు వచ్చేశాం.. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో …
హైదరాబాదులో ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ ను ప్రారంభించిన కేటీఆర్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email స్విట్జర్లాండ్ కు చెందిన సంతానసాఫల్య వైద్యచికిత్స, ప్రసూతి ఆరోగ్య మందుల ఉత్పత్తి సంస్థ ఫెర్రింగ్ ల్యాబరేటరీస్ హైదరాబాదులో ప్రారంభమైంది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ ఔషధరంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. రూ.246 కోట్లతో స్విస్ […]