జాతీయం ముఖ్యాంశాలు

ముంబైలో  కుప్పకూలిన భవనం

ముంబై, జూలై 27: మహారాష్ట్రలోని నవీ ముంబైలో షాబాజ్ గ్రామంలో మూడు అంత‌స్తుల భ‌వ‌నం కూలింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా పేక మేడల కుప్పకూలింది. ఈ భవనంలో 24 కుటుంబాలు నివసిస్తున్నాయని పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌ర్ని ర‌క్షించారు. మ‌రికొంత మంది శిథిలాల కింద ఉన్నారు. రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారు.అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం శిథిలాల నుంచి ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. న‌వీ ముంబైలో మూడు అంత‌స్తుల భ‌వ‌నం కూలింది. ఆ బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ఈ దుర్ఘ‌ట‌న‌ శ‌నివారం ఉద‌యం జ‌రిగింది. ఇద్ద‌ర్ని రెస్క్యూ చేశామ‌ని, మ‌రో ఇద్ద‌రు శిథిలాల కింద ఉండి ఉంటార‌ని న‌వీ ముంబై డిప్యూటీ ఫైర్ ఆఫీస‌ర్ పురుషోత్త‌మ్ జాద‌వ్ తెలిపారు. తెల్ల‌వారుజామున 4.50 నిమిషాల‌కు త‌మ బిల్డింగ్ కూలిన‌ట్లు ఫోన్ వ‌చ్చింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంద‌ని న‌వీ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మీష‌న‌ర్ కైలాశ్ షిండే తెలిపారు.