సైదాబాద్: నాల ఉత్సవాల్లో భాగంగా కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సైదాబాద్లో నిర్వహించిన తొట్టెలు, ఫలహారం బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగింది.. ఈ ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు. కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెడ్డి బస్తి కార్పొరేటర్ నివాసం నుడి ప్రారంభమైన నాగులమ్మ ఆలయం వరకు ఊరేగింపు సైదాబాద్ బస్తీల మీదుగా కొనసాగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నగరవాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమన్నారు. మతసామరస్యానికి పాతనగరం ప్రతీక అని, అన్ని కులాలు, మతాలు తమ పండుగలను సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకుంటున్నారని తెలిపారు. గత 21 ఏళ్లుగా ఫలహార బండి బోనాల ఊరేగింపు నిర్వహిస్తున్నామని చెప్పారు.
Related Articles
రుణమాఫీ కాలేదా-ఈ హెల్ప్ లైన్ కు కాల్ చేయండి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాపీ అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో రూ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు విడతల నిధులు విడుదల చేసింది. రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస…
రామచంద్రపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కోలమూరు శివాజీ ఆత్మహత్యాయత్నం, మంత్రి వేణు సమక్షంలో శివాజీ పై దాడి
రామచంద్రపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కోలమూరు శివాజీ …
రాముడి ఫోటోతో ఓట్లు అడుగుతున్నారు
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన…