విజయవాడ: చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కొడుకుతో కలిసి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. వారి దాడులు, దారుణాలుచెప్పకుండా టీడీపీ పై పడి ఏడుస్తున్నారు. వారి కబ్జాలు, దోపిడీల గురించి ప్రజలు పిటీషన్లు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచేశారు. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, అనచరులు మరోచోట పోటీ చేసి చిత్తూరు జిల్లాలో వేల కోట్లు దోచుకున్నారు.చిత్తూరు జిల్లా వీరప్పన్ గా పెద్దిరెడ్డికి నామకరణ చేస్తున్నాం. వారి దోపిడీకి అడ్డం వస్తున్నారనే చంద్రబాబు ను ఓడించేందుకు వందల కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారు. ప్రజల సొమ్మును దోచుకుని.. ఆ సొమ్ముతోఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపధం చేశారు. చంద్రబాబును ఓడించడం కాదు కదా.. ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్ది రెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తుచేయాలి. చంద్రబాబు పై రాళ్లు వేయించి ఆయన పర్యటనను అడ్డుకున్న నీచ చరిత్ర వాళ్లది. చిత్తూరు జిల్లా వీరప్పన్ ఆస్తులు మొత్తం అవినీతిమయం.. కాబట్టి కేసులు పెట్టి అరెస్టు చేయాలని అన్నారు.ప్రజలు ఇఛ్చిన ఫిర్యాదులను సుమోటాగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. చంద్రగిరి చెవిరెడ్డికి, తిరుపతి భూమనకు, నగరి రోజాకు వదిలి.. మిగతా ప్రాంతాలు మొత్తం పెద్దిరెడ్డే దోచుకున్నారు. టీడీఆర్ లో భూమన, దాడులకు చెవిరెడ్డి, అతని కుమారుడు పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే నానిపై దాడి చేసి చంపేందుకు యత్నించారు పెద్ది రెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేయాలి. ఎర్రచందనం స్మగ్లర్లను మించి ఈ వీరప్పన్ దోపిడీ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభ్యర్దిస్తున్నా. 2019 నుంచి 2024 వరకు దోచుకున్న అటవీ
సంపదపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. నేను ఒక కామన్ మెన్ గా ఈ దోపిడీపై ఫిర్యాదు చేస్తున్నా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని సీబీఐకి లేఖ రాసి వారి ఆస్తులను జప్తు చేయాలి. ఒక్కరోజు ఐదు వందల మంది పెద్దిరెడ్డి అక్రమాలపై ఫిర్యాదులు చేశారంటే వారి దోపిడి ఎలా ఉందో అర్దం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఐడీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాస్తాను. మరోసారి ఇంతటి అక్రమాలకు ఎవరూ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలనిఅన్నారు.