హైదరాబాద్ జూలై 29: తనపై ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ముక్కు నేలకు రాయడంతో పాటు రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే సిఎం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయాల్లోంచి వెళ్లిపోవాలని సవాల్ విసిరారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోవడంతో పాటు మళ్లీ రాజకీయాల్లోకి రాను అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తనపైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారని, కాంగ్రెస్ పెట్టిన మూడు కేసుల్లో కోర్లులు తనని నిర్దోషిగా తేల్చాయని తెలియజేశారు.పెట్రోల్ బంక్‌లు, మిర్యాలగూడ కేసులు ఉన్నాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారని, వాళ్లు చెప్పిన కేసులపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తాను మాట్లాడితే సిఎం రేవంత్ రెడ్డి భూజాలు ఎందుకు తడుముకుంటున్నారని, మా నాయకుడు కెసిఆర్ హరిశ్చంద్రుడేనని, వాళ్లలా సంచులు మోసే చంద్రుడు కాదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. చంద్రుడి సంచులు మోసి జైలుకు వెళ్లింది రేవంత్ రెడ్డి అని చురకలంటించారు. విద్యుత్ అంశంలో అధికార పక్షం చేస్తున్న ఆరోపణలు సరైనవి కావన్నారు. కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్ కూడా బిహెచ్‌ఎల్‌కే ఇచ్చామని, కోమటిరెడ్డి మాట్లాడిన ప్రతీ అక్షరం రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.‘జగదీశ్వర్‌రెడ్డి సవాలు స్వీకరిస్తున్నా, నేను చేసిన ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి, ఎంఎంఎల్ పదవులకు రాజీనామా చేస్తా’ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిసవాల్ విసిరారు.
Related Articles
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూత
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు హైకోర్టు సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ […]
world youth skills day | తెలంగాణ యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం ( world youth skills day ) సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా తెలంగాణను రాష్ర్ట ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదన్నారు. అందుకు తగ్గట్టుగా […]
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఏపీ పరిమితికి మించి నీటిని తీసుకుంటోందని వెల్లడి తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ కు మరో లేఖ రాసింది. ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించకుండా ఆపాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఏపీ […]