ఆంధ్రప్రదేశ్

పాలకొల్లు పట్టణంలో దొంగల హల్ చల్

పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పట్టణ పగలే దొంగలు హల్చల్ చేశారు. అనసూయ అనే వృద్ధురాలిపై పాశవికంగా దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచి బంగారం దొంగిలించుకుపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొండాడ వారి వీధిలో నివాసం ఉంటున్న కలిశెట్టి అనసూయ అనే వృద్ధురాలు భవనం కింది పోర్షణలో ఒంటరిగా ఉన్నా సమయం చూసుకొని ఇద్దరు దుండగులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి రాయితో ఆమె తలపై బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే ఆమె మెడలోని గొలుసు, చెవి దిద్దులు, నాలుగు బంగారం గాజులు అపహరించుకుపోయారు. భవనం పైఅంతస్తులో ఉంటున్న ఆమె కూతురు, స్థానికులు కేకలు వేయగా వారు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం రంగంలో దిగిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన అనసూయను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్స్ తో సహా సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మీడియోతో మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు వృద్ధురాలను గాయపరిచినట్లు, బంగారం దొంగిలించినట్లు గుర్తించామని వారిని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు…