ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలి

కోవిడ్ నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

సీఎం జగన్ కరోనా వైరస్‌ నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. థర్డ్ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కాన్సన్‌ట్రేటర్లు, డీటైప్‌సిలెండర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలి. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉంచాలి. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.

100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలి. తర్వాత మిగిలిన ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. ప్లాంట్ల ఏర్పాటుకు 30 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. కొత్త మెడికల్‌ కాలేజీల కోసం పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పూర్తిచేయాలి. వ్యాక్సినేషన్‌లో టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.