నంద్యాల: నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం వైరల్ అయ్యింది. అత్తా రింటికి ఆర్టీసీ బస్సు వేసుకుని వెళ్లడంతో అందరూ అవాక్కయ్యా రు. వెంకటాపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుంచి తన అత్తగారి ఊరు ముచ్చు మర్రి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్నాడు. ఎంతసేపటికి బస్సు రాక పోవడంతో దుర్గయ్యకు విసుగొచ్చిం ది. ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రాకపోవడంతో.. వెంటనే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఆర్టీసీ ప్రైవే ట్ బస్సు ఎక్కాడు.. ఆ బస్సును నడుపుకుంటూ అత్తగారి ఊరికి వెళ్లాడు.అయితే అక్కడితో దుర్గ య్య ఊరుకోలేదు. ఆత్మకూరు నుంచి ముచ్చుమర్రి బస్సులో వెళ్లి.. మళ్లీ బస్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. ఈ బస్సు ను ఎందుకు వేసుకుని వచ్చావని పోలీసులు అడిగితే.. ఊరికి వెళ్లడా నికి ఎంత సేపు బస్సు రాకపోవడం తో ఈ బస్సును వేసుకుని వచ్చా నని దుర్గయ్య సమాధానం చెప్పా రు. మనోడి సమాధానం విన్నపో లీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. వెంటనే బస్సును ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ నుంచి ఆత్మకూరుకు తరలించారు.
Related Articles
మెగా బంధం.. ఎమోషనల్
మెగా బ్రదర్స్ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర…
రుషికొండను పరిశీలిస్తున్న కేంద్రబృందం
ఆంధ్రప్రదేశ్ విశాఖలోని రుషికొండ ఇప్పుడు హాట్ టాపిక్గ…
ప్రచారం చేయనున్న నారా రోహిత్
నారా రోహిత్..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ…