సిద్దిపేట: కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురా మొక్కలు నాటారు. అనురాధ మాట్లాడుతూ సమతుల్యమైన ఆహ్లాదకరమైన వాతావరణం గురించి మొక్కలు చాలా ముఖ్యం. భావితరాలను దృష్టిలో పెట్టుకొని మొక్కలు నాటాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది, పరిశుభ్రత, పచ్చదనము, ఆహ్లాదకరమైన వాతావరణము గురించి మొక్కలు చాలా ముఖ్యం అందులో భాగంగా కమిషనరేట్ కార్యాలయం పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి 800 మొక్కలు నాటడం జరిగింది.
నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈనాటి మొక్కలే రేపటి వృక్షాలని భావితరాలకు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటి సంరక్షించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు పరిశుభ్రత పచ్చతనముతో ఆహ్లాదకరంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ యస్. మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, హుస్నాబాద్ ఎసిపి సతీష్,
రిజర్వ్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యాదమ్మ, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, మరియు ఇన్స్పెక్టర్లు, సిఐలు కమిషనర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.