ఆంధ్రప్రదేశ్

కాళహస్తిలో తెప్పోత్సవం

కాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవల్లి దేవసేన సమేత చెంగల్వరాయల స్వామి వారి తెప్పొత్సవం ఘనంగా జరిగింది.సుందరంగా, వివిధ రకాల పుష్పాలు,సర్వకాంతుల మద్య స్వామివారు బయలుదేరి నారద పుష్కరిణి వద్దకు చేరుకున్నారు.అనంతరం ఆలయ అదికారులు అత్యంత వైభవంగా స్వామివారి తెప్పోత్సవం ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ ఎస్ ఎన్ మూర్తి ఆలయ అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు.