నందికొట్కూరు: మల్యాల ఎత్తిపోతల హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి హంద్రీనీవా కాలువకు జలవనరులశాఖ అధికారులు నీరు విడుదల చేశారు .గురువారం ఉదయం జలవనరుల శాఖ అధికారులు 9 వ పంపు మోటార్ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఒక పంపు ద్వారా నీటి విడుదల ప్రారంభించారు.కొద్దిసేపటికి పంపు ట్రిప్ కావడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో మళ్ళీ 8వ,10వ మోటర్ ద్వారా నీటి విడుదల చేశారు. రెండు పంపుల ద్వారా హంద్రీనీవా కాలువకు 700 క్యూసెక్కుల నీటిని కర్నూలు,నంద్యాల, చిత్తూరు, అనంతపురం జిల్లా ప్రజల సాగు తాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్ ఈ రాంగోపాల్, ఈ ఈ సురేష్ రెడ్డి, డిప్యూటీ సెక్షన్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, నందికొట్కూర్ జడ్పీటీసీ కలిమున్నీసా, హంద్రీనీవా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Related Articles
శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేత
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email శ్రీశైలం జలాశయం కి వరద తగ్గుముఖం పడడంతో అధికారులు గేట్లను మూసివేశారు. నేడు ఉదయం 10 గంటల వరకు ఒక గేటు ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు వరద ప్రవాహం తగ్గడంతో ఒక గేటును కూడా మూసివేశారు.76,294 క్యూసెక్కుల నీరు వస్తుండగా కుడిగట్టు విద్యుత్ కేంద్రం […]
జగన్ తో సహా 41 మందికి నోటీసులు
ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ కృష్…
వైసీపీ, జనసేన, టీడీపీ క్రాకర్స్
వచ్చే ఏడాది ఏపిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ…