ఆంధ్రప్రదేశ్

టీడీపీ శ్రమదానం

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లో నిర్మించే రైల్వే బ్రిడ్జీ ప్రాంతాలలో టీడీపీ P ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు..మక్లూర్ మండలంలోని అడివి మామిడిపల్లి గ్రామంలో  రైల్వే పనులు నత్త నడకన నడుస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు దేగాం యదాగౌడ్ మండిపడ్డారు…. నత్త నడకన నడుస్తున్న రైల్వే బ్రిడ్జి పనుల కారణంగా బ్రిడ్జి పక్కన దారి అద్వాన స్థితిలో ఉందని పలుమార్లు వాహనదారులు కింద పడ్డ పట్టించుకునే నాధుడు లేడని అన్నారు.గత ఏడు సంవత్సరాల నుండి బ్రిడ్జి పనులు నత్తనడకన నడుస్తున్నయని బ్రిడ్జి పనులు  ఇప్పటికీ పూర్తకాకపోవడం సిగ్గుచేటన్నారు…. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ చూపి ఈ అద్వాన పరిస్థితి చూసైనా పనులు త్వరగా పూర్తయ్యేలా చేయాలని అన్నారు.. అధికారులు,నాయకులు సైతం ఈ రోడ్డుపైన వెళుతూ కనీసం చూసి చూడనట్టు వెళ్లడం సిగ్గుచేటని అన్నారు….