మేడ్చల్: అరెండ్ల నుండి ఉప్పల్ ఎలివెటర్ కారిడార్ పనులు నిర్లక్ష్యం గురైందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఇంగ్లీష్ లో మాట్లాడడం, సెల్పిలు దిగడం తప్పా, హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చెయ్యలేదు. గతంలో ఇదే నియోజకవర్గం నుండీ గెలిచిన రేవంత్ రెడ్డి ఉప్పల్ వెలివేటర్ కారిడార్ పనులు పై అనేక సార్లు పార్లమెంట్ లో మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రినీ నితిన్ గడ్కారీనీ కలిసి చెప్పాను. ఆరెండ్ల నుండి ఉప్పల్ వెలివేటర్ కారిడార్ పనులు నిర్లక్ష్యానికి గురైంది అని చెప్పాను. కొత్త టెండర్లతో పనులకి అవకాశం ఇచ్చారు….ఇంకో 200 నుండి 300 కోట్ల వరకు పెరుగుతుందని అన్నారు. వర్ష కాలంలో రోడ్లన్ని దెబ్బతిన్నాయి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు భాగ ఇబ్బందులు పడుతున్నారు అని నాకు తెలుసు. నేను మాట ఇస్తున్నా వచ్చే 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తాం. పదేండ్ల పాటు పాలించిన గత ప్రభుత్వం పనులు చెయ్యకుండా నిర్లక్ష్యానికి గురి చేసింది. లక్ష కోట్లు పెట్టీ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలింది. మూసీ నది అభివృద్దికీ మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది…. ప్రపంచ బ్యాంకుతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు.. నిధులు తెచ్చి మూసీనీ అభివృద్ది చేస్తాం. 31 వేళ కోట్లతో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. చైనా లో 57 అంతస్తుల హోటల్ 30 రోజుల్లోనే కట్టారు. దేశంలోని మొట్టమొదటి హోం మంత్రి, సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. అసెంబ్లీలో మేము మహిళలను కించ పరచలేదు. మా ప్రభుత్వంలో పదవులు అనుభవించి పార్టీ మారిన వ్యక్తీ సబిత ఇంద్రారెడ్డి. మా ప్రభుత్వం మహిళలను గౌరవిస్తుంది… మహిళలకు రెండు పదవులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. 65 గంటల్లో 45 గంటలు ప్రతిపక్ష నేతలే మాట్లాడారు. అసెంబ్లీకి రాని వ్యక్తికీ ఎమ్మెల్యే పదవీ అవసరమా. టోపీ పెట్టుకొని తిరుగుతున్న వ్యక్తి కెసిఅర్…. ఆయన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలి. ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులు అక్టోబర్ 1 నాడు ప్రారంభిస్తున్నాము. 18 నుండి 20 నెలల్లో పూర్తి చేసి చూపిస్తానని అన్నారు. …
Related Articles
ఎలక్షన్ ఫీవర్
తెలంగాణలో ఎన్నికల ఫీవర్ మొదలయింది. ఎప్పుడైనా నోటిఫికే…
మ్యానిఫెస్టోలకు ఓట్లు రాలతాయా…
మంత్రాలకు చింతకాయలు రాలతాయా అనేది వెటకారం సామెత.. రాజకీయ…
9 నెలల తర్వాత రాజ్ భవన్ లో అడుగుపట్టిన సీఎం కేసీఆర్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 9 నెలల తర్వాత రాజ్ భవన్ లో అడుగుపెట్టారు. ఈరోజు మంగళవారం హై కోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చారు. గత కొంతకాలంగా రాజ్ […]