తెలంగాణ

నిండుకుండలా సాగర్ రిజర్వాయర్

నల్గోండ, ఆగస్టు 5: నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుండటంతో… సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు భారీగా ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.. దీంతో సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు.. నాగార్జునసాగర్‌కు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మొదట ఆరు గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది.. నాగర్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.