తెలంగాణ

ఐటీడీఏ ఎదుట డీఎస్సీ అభ్యర్దుల ధర్నా

ఉట్నూరు: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో  ఐటీడీఏ ఎదుట విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోఏజెన్సీ డీఎస్సీ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు వెనుకబడి ఉన్న ఐటీడీఏ నుంచి ఏజెన్సీ డిఎస్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో అసెంబ్లీలో ఒక్కరోజు కూడా ఆదివాసుల గురించి ప్రస్తావన తీసుకోకపోవడం చాలా బాధాకరమని ఇప్పుడున్న ఎమ్మెల్యే   జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా ఆదివాసుల గురించి మాట్లాడటం సంతోషకరమని తెలియజేశారు