తెలంగాణ ముఖ్యాంశాలు

హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్. 15 వేల మందికి ఉద్యోగాలుఅమెరికాలో సీఎంతో చర్చలు జరిపిన కంపెనీ ప్రతినిధి బృందం..

హైదరాబాద్: ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.  అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం  కాగ్నిజెంట్ రవికుమార్, కంపెనీ  ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భేటీలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి.  సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ది కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే  కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది.