తెలంగాణ

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు

సూర్యాపేట: చిలుకూరు మండలం పాత కొండాపురం గ్రామంలో, వంట గ్యాస్ పేలి ఓకె కుటుబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉదయాన్నే వంట చేసే క్రమంలో, ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజి జరగడంతో, సిలిండర్ పేలి ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో మేరిగా గురవయ్య, కొడుకు అరుణ్ గోపాల్ , కోడలు శిరీషాకు తీవ్రగాయాలు అయ్యాయి. సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు క్షతగాత్రులను, కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో వైద్య సేవలు అందిస్తున్నారు…