హైదరాబాద్: ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో బియ్యాన్ని నగరం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో గుండ్లపోచంపల్లి
3 మున్సిపాలిటీ కండ్లకయ సమీపంలో పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ఎల్బీనగర్లో 17 టన్నుల రేషన్ బియ్యాన్ని ఫయాజ్ అనే వ్యక్తి లారీ(కేప33 8077)లో లోడ్
చేయించారు. డ్రైవర్ రాజశేఖర్ (42)ను బియ్యాన్ని మేడ్చల్ మీదుగా మహారాష్ట్రకు తరలించేందుకు పురమాయించాడు. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో కండ్లకోయ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీ ప్రజా పంపిణీ బియ్యాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. డ్రైవర్ రాజశేఖర్ను అదుపులోకి విచారించగా బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు తేలింది. ఫయాజు మహారాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తుండగా అక్కడ రత్నాకర్ అనే వ్యక్తిని కొనుగోలు చేస్తున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పోలీస్టేషన్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.