ఆంధ్రప్రదేశ్

 డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ -లావణ్య, రాజ్ తరణ్ వ్యవహారంతోనూ లింకులు !

గుంటూరు ఆగస్టు 13: లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారంలో ఎక్కువగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. లావణ్యకు మస్తాన్ సాయినే డ్రగ్స్ సరఫరా చేసేవాడని..ఆయనతోనే చాలా కాలం సహజీవనం చేసిందని రాజ్ తరుణ్ ఆరోపించారు. అయితే అప్పట్నుంచి ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి కనిపించకుండా పోయారు. పలు డ్రగ్స్ కేసుల్లో ఈ మస్తాన్ సాయి ఉన్నట్లుగా గుర్తించిన హైదరాబాద్ పోలీసులు పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. గుంటూరులోని ఓ దర్గాలో తలదాచుకున్నట్లుగా గుర్తించి..అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మస్తాన్ సాయి అనే వ్యక్తి డ్రగ్స్ బిజినెస్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని గుర్తించారు.  హైదారాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ ,ఇటీవల డిల్లి నుంచి డ్రగ్స్ తెస్తున్న నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని గుర్తించారు. పోలీసులు మస్తాన్ సాయి ఫోన్‌ను స్వాధీనం  చేసుకుని అందులో వివరాలను పరిశీలిస్తే..  మైండ్ బ్లాంకయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్ సాయి ఫోన్ లో చాలా మంది అమ్మాయి ల ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు గుర్తింంచారు. పలువురు అమ్మాయిలు ప్రయివేటు వీడియోలు చిత్రకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గుర్తించారు. మస్తాన్ సాయి మొబైల్ లో వీడియోలపై ఆరా తీస్తున్న పోలీసులు .. వారిని ఎలా ట్రాప్ చేశారో తెలుసుకుంటున్నారు. ఏపీ , తెలంగాణా  కి చెందిన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకొని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాలు .. ఇతర ప్రలోభాలకు గురి చేసి మస్తాన్ సాయి యువతుల్ని వంచిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య కూడా మస్తాన్ సాయి ట్రాప్ లో పడినట్లుగా తెలుస్తోంది. మస్తాన్ సాయితో కలిసి డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించిన తర్వాతనే లావణ్య దూరమైందని.. డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్ని సార్లు చెప్పినా వినలేదని రాజ్ తరుణ్ మీడియా సమావేశంలో చెప్పారు. లావణ్య కూడా మస్తాన్ సాయితో పరిచయం ఉందని చెప్పింది కానీ.. అంతకు మించి  పెద్దగా వివరాలు జోలికి వెళ్లలేదు. డ్రగ్స్ వ్యాపారంపై పంజా విసురుతున్న హైదరాబాద్ పోలీసులు.. మస్తాన్ సాయిని అరెస్టు చేస్తే ప్రధానంగా గుట్టు రట్టవుతుందని క్లారిటీ రావడంతో నిఘా పెట్టారు. తన కోసం పోలీసులు వెదుకుతున్నారని తెలిసిన తర్వాత మస్తాన్ సాయి.. ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే డ్రగ్స్ బిజినెస్ మాత్రం మానలేదు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ.. గుంటూరు రైల్వే స్టేషన్ లో దొరికినట్లు దొరికి తప్పించుకున్నాడు. కానీ తర్వాత పోలీసుల నిఘాకు దొరికిపోయాడు. విచారణలో సంచలన విషాయలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.