ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వైసీపీ పాలనలో గ్రామీణ అభివృద్ధి గాలికి..ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి  ప్రశాంతి రెడ్డి పడుగుపాడులో పర్యటించారు. పడుగుపాడు నుండి జాతీయ రహదారిని కలిపే ఫోర్ లైన్ రోడ్ సెంట్రల్ లైటింగ్ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. వైసిపి ఐదేళ్ల పాలనలో గ్రామీణ అభివృద్ధిని గాలికి వదిలేసారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ  వి పి ఆర్ ఫౌండేషన్ ద్వారా క్లీన్ కోవూరు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామన్నారు. మురుగు కాలువలు త్రాగునీరు  మౌలిక వస్తువులను కల్పిస్తూ ప్రభుత్వ సహకారంతో ప్రతి గ్రామానికి రోడ్లు వేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.