తెలంగాణ

 ఏసీబీ వలలో అడిషినల్  కలెక్టర్

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఎసిబి ట్రాప్ చేసి పట్టుకుంది. ధరణిలో ఒక పని చేసేందుకు ఎనిమిది లక్షలు అడిషనల్ కలెక్టర్ డిమాండ్ చేసాడు.
బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో  జాయింట్ కలెక్టర్ ను ఏసీబీ ట్రాప్ చేసింది. ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలని బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు ఎనిమిది లక్షలు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి డిమాండ్ చేసాడు.  బాధితుడి పిర్యాదు మేరకు ఏసీబీ రంగంలోకి దిగింది. బాధితుడు కారులో డబ్బులు ఇస్తున్నప్పుడు ఏసీబీ  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చెప్పాడు. ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసాడు. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని అడిషినల్ కలెక్టర్ ఫోన్లో మాట్లాడాడు. పెద్ద అంబర్పేట్ వద్ద  భూపాల్ రెడ్డి కి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండఏసీబీ గా పట్టుకుంది.