శ్రీకాకుళం, ఆగస్టు 14: శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో దువ్వాడ కుటుంబం ఒకటి. వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ తండ్రివైపు నుంచి ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదంటున్నారు. ఆయన తండ్రి సాధారణ రైల్వే ఉద్యోగి. ఇదే సమయంలో ఆయన అత్తింటి వారు తొలి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక వాణిని వివాహం చేసుకున్నాకే దువ్వాడ రాజకీయాల్లోకి వచ్చారు. జిల్లాలో కీలక నేత అయిన దివంగత కింజరాపు ఎర్రన్నాయుడి కుటుంబానికి తొలి నుంచి ప్రత్యర్థిగా దువ్వాడ మామ సంపతిరావు రాఘవరావు రాజకీయాలు చేస్తూ వచ్చారు.ఎర్రన్నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలి ఎన్నిక తప్పితే ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ దువ్వాడ మామ సంపతిరావు రాఘవరావే ఆయనకు ప్రత్యర్థి. ఇక దువ్వాడ వాణి సైతం 2004లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇలా దువ్వాడ కుటుంబం నుంచి ఆయన మామ, భార్య, తప్పితే దువ్వాడ శ్రీనివాసే కింజరాపు కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులుగా పోరాడారు. ఐతే గత ఎన్నికల ముందు టెక్కలి రేసులో దువ్వాడ కుటుంబం నుంచి కాకుండా మరొకరిని పోటీకి దింపాలని వైసీపీ అధిష్టానం భావించిందట… ఇక్కడే అసలు రాజకీయం మొదలై… కుటుంబంలో చిచ్చుకు కారణమైందని చెబుతున్నారు.2019లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్. ఇక 2019లో టెక్కలి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్‌ను గత ఎన్నికలకు ఎంపీగా పోటీకి నిలిపారు. దీంతో టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలపాలని వైసీపీలో చర్చ జరిగిందని చెబుతున్నారు. ఆ సమయంలో దువ్వాడ ఇన్‌చార్జిగా ఉండటం వల్ల… ఆయన భార్య వాణి పోటీ చేయాలని భావించారట. ఐతే దువ్వాడ మాత్రం అప్పటికే తనకు సన్నిహితంగా ఉంటున్న మాధురిని తెరపైకి తేవాలని ప్రతిపాదించారని అంటున్నారు. దీంతో అప్పటివరకు మాధురి పట్ల కాస్త మెతక వైఖరితో వ్యవహరించిన దువ్వాడ వాణికి అనుమానం మొదలైనట్లు చెబుతున్నారు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వాణి… భర్త సహకారంతో తన పిల్లలకు ఆ వారసత్వాన్ని అప్పగించాలని భావిస్తే… హఠాత్తుగా వేరే మహిళ తమ కుటుంబంలో చొరబడి ఏకంగా రాజకీయంగా కీలకమవ్వడాన్ని వాణి తట్టుకోలేకపోయారంటున్నారు.దీంతో పార్టీ ప్రతిపాదనకు తన భర్త ఆలోచన తోడైతే… తమ కుటుంబ రాజకీయమే ప్రమాదంలో పడుతుందనే ఆందోళనతో వాణి అప్పటి సీఎం జగన్‌ను కలిసి తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో దువ్వాడ బదులుగా వేరొకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్న జగన్… అప్పటికప్పుడు వాణిని ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు ప్రకటించారంటున్నారు.అధినేత ఆశీస్సులతో ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించిన వాణి… ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమవగా, ఎన్నికల సమయంలో దువ్వాడ వ్యూహాత్మకంగా పావులు కదిపి టికెట్ సాధించుకున్నారంటున్నారు. దీంతో ఇండిపెండెంట్‌గా పోటీకి దిగాలని వాణి సిద్ధపడగా, కుటుంబ కలహాలు బయటపడితే… ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ఆలోచన చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ తన భార్యకు ఆస్తులను రాసిచ్చి బుజ్జగించినట్లు చెబుతున్నారు. భర్త పేరిట ఉన్న ఆస్తులు, కంపెనీలు తన చేతికి రావడంతో ఎన్నికల సమయంలో శాంతించిన వాణి…. ఎన్నికల ప్రచారంలో మాధురి యాక్టివ్ అవ్వడమే కాకుండా… తానే సర్వం అన్నట్లు ఎలక్షనీరింగ్ చేయడంతో వాణి రగిలిపోయినట్లు చెబుతున్నారు. ఇక ఎన్నికల తర్వాత కూడా టెక్కలి కేంద్రంగా దువ్వాడ, ఆయన స్నేహితురాలు రాజకీయాలు చేయాలని భావించడాన్ని భరించలేకపోయిన వాణి… కుమార్తెలతో కలిసి వివాదానికి దిగినట్లు చెబుతున్నారు.ఎన్నికల ముందు ఆస్తులు రాసిచ్చినా…. రాజకీయంగా పిల్లలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే దువ్వాడ ప్రస్తుతం నివాసం ఉన్న ఇంట్లోకి వెళ్లాలని వాణితోపాటు కుమార్తెలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాము ఆ ఇంట్లో ఉంటే మాధురి అక్కడికి రాదని… ఆ విధంగా తమ కుటుంబ రాజకీయ మనుగడకు ముప్పు లేకుండా కాపాడుకోవాలని వాణి నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సమయంలో తాను భర్తను నేరుగా ఢీకొట్టి… ఇన్నాళ్లు తెరచాటుగా కొనసాగిన వ్యవహారాన్ని బయటకు లాగడం ద్వారా దువ్వాడ, ఆయన స్నేహితురాలిని రాజకీయంగా తొక్కేయడమూ వాణి ఆలోచనేనంటున్నారు. అంతిమంగా దువ్వాడ తమ దారికి వస్తే సరేసరి లేదంటే ఆయనను దోషిగా నిలిపి…. రాజకీయంగా దెబ్బతీయడమే వాణి వ్యూహమంటున్నారు. ఇందుకోసం కుటుంబంలో అందరి సహకారం తీసుకున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి జడ్పీటీసీ వాణి రాజకీయ వ్యూహంతోనే మొత్తం ఎపిసోడ్‌ను నడిపిందని అంటున్నారు
Related Articles
సీఐడి చేతికి హై ప్రొఫైల్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ మరో సారి యాక్టివ్ అవుతోంది. వైఎస్ఆర్సీప…
బీఫాంలు ఇచ్చిన పవన్
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభం క…
ఇది అడ్డంగా దొరికిపోయిన కేసు మంత్రి రోజా
చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ నాయకులంతా దాదాపుగా సంబరాల్ల…