తెలంగాణ

స్వాతంత్ర్య పోరులో ముస్లిం వీరులు

కమాన్ పూర్: తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ
 మంథని బాలికల- 1- జూనియర్ కళాశాల రాఘవాపూర్ పెద్దపల్లి జిల్లా లో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కార్యక్రమం లో ముఖ్య అతిథి గా పాల్గోని క్వాజీ ముహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పి ఎమ్ ఆర్ ఈ ఐఎస్ కౌన్సిలర్ -జే ఐ హెచ్ -వైస్ ప్రెసిడెంట్ -జమాత్ ఇ ఇస్లామీ హింద్ జాతీయ జెండాను ఎగురవేశారు. వారు మాట్లాడుతు  సం కుచిత భావాలు గల కొందరు చరిత్ర కారులు 1857, అంతకుముందు. జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో అసువులుబాసిన యోధుల పేర్లను కనుమరుగు చేశారు. వారంతా ముస్లింలు కావడమే అందుకు కారణం. నాటి స్వాతంత్ర్య పోరాటంలో హిందువులతో పాటు ముస్లింలు జతకలిశారు. కానీ, ఏదో నామమా త్రంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి ఒకరిద్దిరి పేర్లు తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో ఇతర వీరుల పేర్లు కానరావు. స్వతంత్ర పోరాటంలో నామమాత్రంగా కూడా పాల్గొనని కొన్ని సంస్థల ప్రతినిధులు దేశభక్తి, జాతీయవాదం గురించి మాట్లాడటం విడ్డూరం. ఈ గడ్డలో పుట్టి తమ మాతృభూమి బానిస సంకెళ్లను తెంచేందుకు ప్రాణ త్యాగాలు చేసిన అష్ఫాఖుల్లాఖాన్, హసన్ మోహారీ, టిప్పు సుల్తాన్ తదితరుల చరిత్రను ప్రజలకు తెలి యజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్న ది. జై హింద్, ఇంక్విలాబ్ జిందాబాద్ లాంటి నినాదాలు కూడా ముస్లిం యోధులు సృష్టించినవే.
స్వాతంత్ర్యం కోసం 200 ఏండ్లపాటు ఎందరో యోధులు కులమతాలకతీతంగా వీరోచితంగా
పోరాడారు. 1750లలోనే స్వాతంత్ర్యోద్యమానికి అంకురార్పణ జరిగింది. ఈస్టిండియా కంపెనీ పేరు తో వ్యాపార నిమిత్తం దేశంలోకి అడుగుపెట్టిన ఆం గ్లేయులు చాపకింద నీరులా తమ ప్రాబల్యాన్ని పెం చుకున్నారు. ముస్లిం పాలకుల నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ముస్లింలను అధికార పీఠం నుంచి తప్పించి గద్దెనెక్కారు. కోల్పోయిన పీఠాన్ని తిరిగి పొందేందుకు ముస్లింలు ఆంగ్లేయు లకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్య్ర పోరాటా నికి మొదట శంఖం పూరించింది ముస్లింలేనన్నది. దీనిద్వారా తెలుస్తున్నది. 1758లో ముర్షీదాబాద్, బెంగాల్లో సిరాజుద్దాలా తాత అలీవర్దీఖాన్ ఆంగ్లే యులకు వ్యతిరేకంగా పోరాడారు. 1799లో దక్షిణ భారతదేశంలో మైసూరు పులి టిప్పు సుల్తా న్, ఆయన తండ్రి హైదర్ ఆంగ్లేయులతో పోరాడారు.
కొందరు స్వదేశీయులు ఆంగ్లేయులతో దేతులు కల పకుండా ఉంటే మన దేశానికి 200 ఏండ్లకు పూర్వమే స్వాతంత్య్రం లభించేది. తెల్లవాళ్ల నుంది ఈ దేశానికి విముక్తి కలిగించేందుకు ఎంతోమంది యోధులు తమ రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. జైళ్లల్లో మగ్గాల్సి వచ్చింది. ఉరికంబాన్ని ముద్దా. డాల్సి వచ్చింది. ఆస్తులన్నీ ధారపోయాల్సి వచ్చింది. ఇల్లూవాకిలీ వదిలేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించేందుకు తమ దన. ప్రాణా లను మూల్యంగా చెల్లించుకునేందుకు ముస్లింలు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉన్నారు.చివరి మొగల్ చక్రవర్తి బహదూరా జఫర్ను బ్రిటిషర్లు రంగూన్ జైలులో బంధించి, కండ్లముందే అతని నలుగురు కుమారులను గొంతుకోసి చంపే
మంజూరు చేయడం వారి త్యాగాలకు నిదర్శనం,శారు. ‘చక్రవర్తిగా పాలించిన నాకు రెండడుగుల భూమి కూడా దొరకని దుస్థితి, ఇంతకంటే దురద్భ ష్టవంతులు ఎవరుంటారు’ అని తన ఆవేదనను కవి త రూపంలో రాసుకున్నాడాయన. స్వాతంత్ర్యం కో సం ముస్లింలు చేసిన త్యాగాలకు మచ్చుతునక ఇది.
ముస్లిం యోధులు అనుభవించిన శిక్షల్లో కాలా పానీ శిక్ష అత్యంత పాశవికమైనది. ఈ కాలాపానీ జైల్లో మగ్గినవారిలో 95 శాతం ముస్లింలే, అందు లోనూ ఉలమాలే అధికం. మౌలానా జాఫర్, మౌలానా విలాయత్ అలీ (రహ్మాలై), మౌలానా యాహ్యా (రహ్మాలై) లాంటి ఉలమాల పేర్లు ముందువరుసలో ఉంటాయి. కాలాపానీ శిక్షకు భయపడి చాలామంది బ్రిటీషర్లకు కొమ్ముకాస్తూ మహాత్మాగాంధీకి వ్యతిరేకంగా పనిచేసేవారు. గాంధీని హత్యచేసిన వర్గం స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా, ఆంగ్లేయులకు అనుకూలంగా పనిచే  మౌలానా అబుల్ కలాం ఆజాద్ (రహ్మాలై) ‘జాతీయోధ్యమంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆజాడ్పై అడుగడుగునా ఆంక్ష లుండేవి, స్వాతంత్ర్యోద్యమ స్పూర్తిని రగిలించేం దుకు ఆయన సొంతంగా పత్రికను నడిపేవారు. దీన్ని సహించని ఆంగ్లేయులు అల్ హిలాల్ పత్రి కను నిషేధించారు. మౌలానాను బంధించిన అహ్మద్ నగర్ జైలు నేటికీ అందుకు సాక్ష్యంగా నిలు స్తున్నది. మౌలానా హస్రత్ మోహానీ తన కవితలతో ముస్లింలపై ఎంతో ప్రభావం చూపించారు.
సింది. కాలాపానీ జైలులో ఎలాంటి శిక్షలు అనుభ వించారో పలువురు ఉలమాలు తమ పుస్తకాల్లో రాసుకున్నారు.
మలబార్లో మోప్లా ముస్లింలు కూడా స్వతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. మోప్లా ముస్లిం లను ఆంగ్లేయులు చిత్రహింసలు పెట్టారు. కేరళకు చెందిన 125 మంది ముస్లింలను బ్రిటిషర్లు బంధిం చారు, వాళ్లను కోర్టులో హాజరుపర్చేందుకు మాల్గా డీలో తీసుకెళ్లారు, 50 మంది పట్టే వాహ నంలో 125 మందిని కుక్కి తలుపులు మూసేశారు. 3 రోజుల ప్రయాణం తర్వాత తలుపు తీసి చూడ గా.. 65 మంది ఊపిరాడక చనిపోయి ఉన్నారు. మీ గతా వారంతా స్పృహ తప్పి పడిపోయారు. బతికిన వారిని మద్రాసు కోర్టులో హాజరుపర్చి ఉరిశిక్షవిం చారు. కేరళ ప్రభుత్వం 1971లో వారి త్యాగాలను గుర్తించి మోప్లా యోధుల కుటుంబాలకు పింఛను
ఉలమాలు స్వతంత్ర సమరాంగణంలో రాజీలేని పోరాటాలు చేశారని, ఎనిమిది లక్షల మంది బలి దానాలు చేశారని డాక్టర్ తారాచంద్ అనే రచయిత తన గ్రంథంలో రాశారు. ఈ దేశానికి ఎప్పుడు ఆపద వచ్చినా ‘మేమున్నా’మంటూ ముస్లింలు ముందుకొచ్చారు. దురదృష్టవశాత్తూ 1947లో దేశ విభజన జరిగింది. ఈ దేశాన్ని విభజించడాన్ని చాలామంది ముస్లింలు తీవ్రంగా ఖండించారు. సింధ్ నుంచి మద్రాసు దాకా అఖండ భారత్ ఉండాలని వారు కోరుకున్నారు. వారిలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒకరు. ఢిల్లీ జామా మసీదు వద్ద ఆజాద్ చేసిన ప్రసంగం చరిత్రాత్మకం. ‘మీ. రంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నాడు? ఈ మసీదు మినార్లు మిమ్మల్ని పిలుస్తున్నాయి. విభజన వల్ల దేశంలోని ముస్లింలు బలహీనపడ తారు’ అని నాడు ఆయన చేసిన ప్రసంగం పుస్త కాల్లో నేటికీ నిక్షిప్తమై ఉంది. ఈ దేశ స్వతంత్ర సమ రాంగణంలో ముస్లింల త్యాగాలు చిరస్మరణీయ
మనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలని వారు కొరారు – ప్రతిబ కనబర్చిన విద్యార్థు లకు ప్రిన్సిపాల్ అస్మా జబీన్, ఐషా సిద్దిఖా- కౌన్సిలర్ , అథియా షుగిఫ్తా-(
 జి-ఐ-ఓ-గల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్( సంస్థ),ప్రతినిధి – సన్మా నిoచి,మెమోంటోలు, సర్టిఫికెట్లు బహుకరించారు-కార్యక్రమం లో బోధన, బోధనేతర, సిబ్బంది విద్యార్థులు, తల్లిదండ్రులు  తదితరులు పాల్గొన్నారు –