రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడి
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 591 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,997 గా ఉంది. ఇద్దరు మృతి చెందారు. కాగా , జీహెచ్‌ఎంసీ పరిధిలో 68 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.