తెలంగాణ ముఖ్యాంశాలు

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

గత ఏడాది తో పోలిస్తే మూడు గంటల ముందే నిమర్జన ప్రక్రియ పూర్తి అయింది. బుధవారం ఉదయానికి అన్ని ట్రాఫిక్ జంక్షన్ లు క్లియర్ అయ్యాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సి వి అనంద్ వెల్లడించారు. బుధవారం అయన ట్యాంక్ బండ్ పై మీడియాతో మాట్లాడారు.  సీపీ మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారం నిమర్జనం పూర్తి చేసాం. నెక్లెస్ రోడ్ అలాగే ఐమాక్ వద్ద గ్రౌండ్స్ లో  విగ్రహాలను పార్కింగ్ ఏర్పాటు చేసి సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేసాం. ఖైరతాబాద్ గణేష్ నిమర్జనం అనుకున్న సమయానికి పూర్తి అయింది. ఈ నిమర్జన ప్రక్రియ లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది కి ధన్యవాదాలని అన్నారు.
రాత్రి 10:30 కి ఓల్డ్ సిటీ లో వినాయక విగ్రహాల నిమర్జనం  పూర్తి అయినాయి. ఈరోజు వర్కింగ్ డే ప్రజలకి సహకరించాలి. లేకుంటే కఠిన చర్యలు ఉంటాయి.
మంగళవారం హుస్సేన్ సాగర్ లో దాదాపు 15 వేల విగ్రహాల నిమజ్జనాలు  పూర్తి అయ్యాయి. కొన్ని వాహనాల బ్రేక్ డౌన్ వల్ల కొంత ఆలస్యం అయింది . లేదంటే ఉదయం 7 గంటలకే నిమర్జన ప్రక్రియ పూర్తి అయేది.మొత్తం 11 రోజుల్లో కేవలం హుస్సేన్ సాగర్ లోనే లక్ష విగ్రహాలు నిమర్జనం పూర్తి అయ్యాయని అన్నారు.