తెలంగాణ

సింగరేణి కార్మికులకు భారీ నజరానా

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను దసరా బోనస్ గా ప్రకటించారు. సింగరేణి సంస్థ ఉద్యోగులకు బంపర్‌ బొనాంజా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దసరా సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బోనస్‌ ప్రకటించింది. 2023-24 ఏడాదిలో సింగరేణికి 4,701 కోట్లు లాభం వచ్చింది. ఇందులో సింగరేణి కార్మికులకు 796 కోట్ల రూపాయలు బోనస్‌గా ప్రకటిస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సగటున ఒక్కో కార్మికుడికి 1.90లక్షలు బోనస్‌.. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు 5వేల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు భట్టి. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకూ బోనస్‌ ఇస్తున్నామన్నారు.అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త అందించింది. రూ.4,701 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ లో రూ.796 కోట్లను సింగరేణి కార్మికులకు పంచుతున్నాం. ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి 1 లక్షా 90వేలు బోనస్ ఇస్తున్నాం.

కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇస్తాం. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటి సారి. గత ఏడాది కంటే 20 వేలు అధికంగా బోనస్ ఇచ్చాం. సింగరేణి లాభాల్లో 33 శాతం వాటాను కార్మికులకు బోనస్ గా అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు సైతం తమ వంతు పాత్ర పోషించారు’ అని వ్యాఖ్యానించారు.సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దాంతో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటిస్తున్నాం. దసరా కంటే ముందుగానే సింగరేణిలో లాభాల వాటా పంచడం ద్వారా కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని చూడాలనుకున్నాం. సింగరేణి సంస్థ రాష్ట్రంలోని విద్యుదుత్ప‌త్తి కేంద్రాల‌తో పాటు ఇత‌ర సంస్థ‌ల‌కు, ఇత‌ర రాష్ట్రాల‌కు బొగ్గు ఎగుమ‌తి చేస్తోంది.

సింగ‌రేణి కార్మికులు 2023-24 సంవ‌త్స‌రంలో సంస్థ‌కు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం చేకూర్చారు. ఇందులో సంస్థ విస్త‌ర‌ణ‌, పెట్టుబ‌డుల‌కు రూ.2,289 కోట్లు కేటాయించారు. మిగిలిన‌ మొత్తం రూ.2,412 కోట్లు కాగా, ఇందులో నుంచి మూడో వంతు రూ.796 కోట్ల‌ను కార్మికుల‌కు దసరా బోన‌స్‌గా తెలంగాణ ప్రభుత్వం ప్ర‌క‌టించింది. సింగ‌రేణిలో  41,387 మంది శాశ్వ‌త కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. గ‌తేడాది సింగ‌రేణి కార్మిల‌కు అందిన బోన‌స్‌ రూ.1.70 ల‌క్ష‌లు కాగా, ఈ ఏడాది ఒకొక్క‌రికి బోన‌స్ కింద రూ.1.90 ల‌క్ష‌లు అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు.సింగ‌రేణి సంస్థ ఆర్జించిన లాభాల‌ను పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించారు. రామ‌గుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, సోలార్ విద్యుదుత్ప‌త్తి కేంద్రాన్ని 1000 మెగావాట్ల‌కు విస్త‌రించ‌డం, రామ‌గుండంలో టీఎస్ జెన్ కో ఆధ్వ‌ర్యంలో మ‌రో 1×800 మెగావాట్ల థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రం, జైపూర్‌లోని ప్ర‌స్తుత థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రంలో మ‌రో 1×800 మెగావాట్ల సామ‌ర్థ్యంతో మరో కేంద్రం, ఒడిశాలోని నైనీ బ్లాక్‌పైన (పిట్‌హెడ్‌) 2,400 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన థ‌ర్మ‌ల్ విద్యుదుత్ప‌త్తి కేంద్రం ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

సంస్థ ప‌రిధిలోని వీకే ఓపెన్ కాస్ట్‌, గోలేటీ, నైనీ ఓసీల‌ను ప్రారంభిస్తామ‌ని, సింగ‌రేణి కార్మికులు, ఉద్యోగుల పిల్ల‌ల కోసం నూత‌న రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌, ఏరియా ఆసుప‌త్రుల ఆధునికీక‌ర‌ణ‌తో పాటు హైద‌రాబాద్‌లో మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఉప ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. మ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి ఉద్యోగులు పెద్ద మనసుతో ముందుకొచ్చారు. సింగరేణి కార్మికులు తమ ఒకరోజు వేతనం రూ.10.25 కోట్లను తెలంగాణ సీఎ సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి కాలరీస్‌ వర్కర్క్‌ యూనియన్‌ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ జనరల్‌ సెక్రటరీ జనక్‌ ప్రసాద్, సింగరేణి సీఎండీ బలరాం, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌లు సెప్టెంబర్ 19న కలిసి అందజేశారు. దాంతోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సైతం రూ.2.50 లక్షలను వరద బాధితుల కోసం విరాళం అందించారని తెలిసిందే.