కరోనా కేసుల పెరుగుదలతో అధికారుల నిర్ణయం
నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్‌డౌన్ విధించారు. కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరగటంతో వారంరోజుల పాటు ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా , జూలై 19 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు రాపూరులో 63 కేసులు నమోదయ్యాయి. పట్టణాలు , గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఆందోళన నెలకొంది.