తెలంగాణ ముఖ్యాంశాలు

ఇంజనీరింగ్ కాలేజీలకు  రేవంత్ వార్నింగ్

తెలంగాణ అభివృద్ధిలో యువత పాత్ర పోషించాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించి ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో ఉన్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. విద్యా బుద్దులు నేర్చొని ఉపాధి అవకాశాలతో పేరు తీసుకురావాల్సిన యువత పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, ఇతర డ్రగ్స్ మత్తులో ఊగుతోందని ఆందోళన చెందారు. డ్రగ్స్‌ కల్చర్ చాలా ప్రమాదకరంగా మారుతోందన్నారు రేవంత్. ముఖ్యంగా బీటెక్ విద్యార్థులు ఈ డ్రగ్స్ బారిన ఎక్కువ పడుతున్నారని ఇది మరింత ఆందోళనకరమన్నారు. వారు డ్రగ్స్ వాడటమే కాకుండా పెడ్లర్స్‌లా మారుతున్నారని కామెంట్ చేశారు. ఇలాంటి వారిని పోలీసులు ఎప్పటికప్పుడు పట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం చేస్తున్నారని అన్నారు. ఇలా ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ బారిన పడటానికి కాలేజీలు కూడా ఓ కారణమని ఆరోపించారు రేవంత్ రెడ్డి. విద్యాబోధన సరిగా లేకపోవడం, కాలేజీలో పట్టించుకునే వాళ్లు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తోందని అన్నారు. అందుకే కచ్చితంగా వీటిపై దృష్టి పెట్టాలని కాలేజీలుకు సూచించారు.

విద్యాబోధనపై దృష్టి పెట్టకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రభుత్వం తరఫున యువతకు ఎన్ని విధాలుగా సాయం చేయాలో అన్ని విధాలుగా సాయం చేస్తున్నామని వాటిని అందిపుచ్చుకొని ఎదగాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ప్రైవేటు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి కోర్సులు చదవాలి ఏ విభాగంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చేయాలో కూడా పరిశ్రమలతో చర్చిస్తున్నామన్నారు. పంచ వ్యాప్తంగా బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లోని IT, ITES నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్చేంజీ వంటి బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. బీఎస్ఎఫ్ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్ ను కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి.

కొత్తగా ఏర్పడే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకే ఇప్పటికే తెలంగాణ లోని యువత కోసం నైపుణ్య శిక్షణను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వం.బీఎస్ఎఫ్ఐ రంగంలో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు ప్రపంచంలో పేరొందిన కంపెనీలు ఒక్కో విద్యార్థిపై 5 లక్షల నుంచి 6 లక్షలు శిక్షణకు ఖర్చు చేస్తున్నాయి. మరోవైపు శిక్షణ పూర్తయిన తర్వాత విద్యార్థులు తమ సంస్థలో పని చేస్తారా.. లేదా ఎక్కువ ప్యాకేజీలకు మరో సంస్థకు వెళతారా.. అనే సవాళ్లు కూడా గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లకు ఎదురవుతున్నాయి. అందుకే పరిశ్రమల అవసరాలను, ఇప్పుడున్న సవాళ్లను అధిగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ ప్రదర్శించారు.జనవరిలోనే బీఎఫ్ఎస్ఐ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ డిమాండ్ కు అవసరమైన ఉద్యోగాల కల్పించే దిశగా యువతకు రెగ్యులర్ డిగ్రీతో పాటుగానే నైపుణ్య డిగ్రీ కోర్సును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పుడు మరో అడుగు ముందుకేసి యువత బంగారు భవిష్యత్తుకు తోడ్పడేలా.. మరింత సాకారం అందించేందుకు సిద్దం అవుతోంది. అందులో భాగంగానే తెలంగాణ ఉన్నత విద్యామండలి.. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఖరీదైన మినీ డిగ్రీ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. రెగ్యులర్ డిగ్రీ కోర్సుతో పాటుగానే ఈ కోర్సును విద్యార్థులకు నేర్పించనున్నారు.
ఇవాళ ఏఈఈలకు నియామాకాలు
తెలంగాణ నీటిపారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి చేతుల మీదగా సెప్టెంబరు 26 సాయంత్రం నియామకపత్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఏఈఈలతోపాటు మరో 1800 మంది లస్కర్లకు కూడా నియామకపత్రాలు అందజేయనున్నారు. దీంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులపై ఏర్పాటు చేయనున్న ప్రజంటేషన్‌ కార్యక్రమానికి సీఎం హాజరు అవుతారు. అనంతరం ఈఎన్సీలు, సీఈ, ఎస్‌ఈ, ఈఈ, డిప్యూటీ ఈఈ, ఏఈలతో నీటిపారుదల శాఖ ఏర్పాటు చేయనున్న
తెలంగాణ ఐసెట్‌ 2024 కౌన్సెలింగ్‌లో 90 శాతం సీట్ల భర్తీ.. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువు ఇదే
తెలంగాణ ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ పూర్తైంది. కన్వీనర్‌ కోటాలో మొత్తం ఎంబీఏ, ఎంసీఏ సీట్లలో 90.20 శాతం మేరక సీట్లు భర్తీ అయ్యాయి. ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో సీట్లను మంగళవారం కేటాయించారు. ఎంబీఏలో 28,345 సీట్లలో 25,747 మంది, ఎంసీఏలో 6,966 సీట్లలో 6,095 మందికి సీట్లు కేటాయించినట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు. సీట్లు పొందినవారు సెప్టెంబర్‌ 27వ తేదీలోపు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 28వ తేదీలోగా ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడంతోపాటు ఆయా కాలేజీలకు హాజరవ్వాలని సూచించారు. కాలేజీల్లో సీట్లు వద్దనుకునే వారు సెప్టెంబర్‌ 27లోపు ఆన్‌లైన్‌ ద్వారా సీట్లు రద్దు చేసుకోవచ్చని తెలిపారు.