జాతీయం రాజకీయం

జైళ్లలో మగ్గుతున్న వారిలో 75 శాతం విచారణ  ఖైదీలే..!

జైళ్లలోని లోపాలను తొలగించి నిర్వహణను మెరుగుపరిచేందుకు నూతన చట్టం అమలు,మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో జైలు పరిపాలనలో అనేక మార్పులు తీసుకొస్తున్నాం.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్రా  జస్తాన్ జైపూర్ లో జైళ్లశాఖ మహిళా అధికారుల జాతీయ సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి.
దేశవ్యాప్తంగా జైళ్లలో మగ్గుతున్న వారిలో సుమారు 75 శాతం మంది విచారణ ఖైదీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆర్దిక స్థోమత లేని పేద ఖైదీలకు న్యాయ సేవలు అందించడంతోపాటు జరిమానాల చెల్లింపు, బెయిల్ బాండ్లను అందించే విషయంలో ఆర్థిక సహాయ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. జైళ్లలో పరిమితికి మించి అధికంగా ఖైదీలు ఉండటం పెద్ద సమస్యగా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.  . రాజస్తాన్ జైపూర్ లో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్, డెవలప్‌మెంట్ బిపి ఆర్ డి, ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైళ్ల పరిపాలనలో మహిళా అధికారులు, 4వ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఏమన్నారంటే.
130 ఏళ్ల నాటి జైలు చట్టాలను రద్దు చేసి ఆదర్శ కారాగార, సంస్కరణ సేవా చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లదే. నేరస్తులను నిర్బంధించడం, ఆంక్షలు విధించడానికే 1894 నాటి జైలు చట్టాలు పరిమితమయ్యాయి.
ఖైదీలలో మార్పు తీసుకొచ్చి పునరావాసం కల్పించాలనే మానవతా ధ్రుక్పథంతోనే నూతన చట్టాల అమలు చేస్తున్నాం. జైళ్లలో సంస్కరణలు, పరిపాలన, నిర్వహణతోపాటు కొత్త చట్టాల అమలు బాధ్యత  రాష్ట్ర ప్రభుత్వాలదే.
జైళ్లలోని లోపాలను తొలగించి,  జైలు నిర్వహణను మెరుగుపరిచేందుకు నూతన చట్టాన్ని తక్షణమే  రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. జైళ్లలో సంస్కరణల కోసం ఆధునిక సాంకేతికను వినియోగించాల్సిన అవసరం ఉంది.
 ఖైదీలపై నిఘా, పాలనలో పారదర్శకత కోసం బయోమెట్రిక్ సిస్టమ్, సీసీటీవీ వ్యవస్థ, ఆర్ఎఫ్ఐడి వంటి సాంకేతికతలు, వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలను అమలు చేయాలి.
దేశవ్యాప్తంగా జైళ్లలో పరిమితికి మించి అధికంగా ఖైదీలు ఉండటం పెద్ద సమస్యగా మారింది. జైళ్లలో మగ్గుతున్న వారిలో సుమారు 75 శాతం మంది విచారణ ఖైదీలే. భారతీయ నూతన న్యాయ, సాంకేతిక చట్టం ద్వారా ఖైదీలకు తగిన సహాయం అందించాల్సిన అవసరం ఉంది.
మహిళా ఖైదీ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహారం, నివాసం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జైలు సిబ్బంది మానవతా కోణంలో ఆలోచించి ఖైదీల్లో మార్పు తేవాలి. పునరావాసంలో సహాయపడాల్సిన అవసరం ఉంది. జైళ్ల భద్రత మెరుగుపర్చడం, ఆధునిక సాంకేతికను ఉపయోగించి ఖైదీల పునరావాసంలో సహాయపడేందుకు రూ.950 కోట్లతో ప్రణాళికను రూపొందించాం.ఆర్దిక స్థోమత లేని పేద ఖైదీలకు జరిమానాలు చెల్లింపు, బెయిల్ బాండ్లను అందించేందుకు ఆర్థిక సహాయ పథకాలను అందిస్తున్నం.  జైళ్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులు అనేక  సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కష్టతరమైన జైళ్లలో మహిళా అధికారులు ధైర్యంగా విధులు నిర్వహిస్తుండటం అభినందనీయం.ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు జైలు అధికారులు మరింతగా శ్రేష్టమైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కొత్త క్రిమినల్ చట్టాల అమలులో భాగంగా పోలీసులు, జైళ్లు, ప్రాసిక్యూటర్లు, న్యాయ అధికారుల, ఫోరెన్సిక్ నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడంలో నేర న్యాయ వ్యవస్థ బీపీఆర్ డి, అసాధారణ పాత్ర పోషిస్తుంది.
కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించి ఇప్పటివరకు 325 కోర్సులను అందించిన బీపీఆర్ డీ సంస్థ ఇప్పటి వరకు  నేరుగా 4476 మంది జైలు సిబ్బందికి శిక్షణనిచ్చింది. దేశంలో 23, 772 మంది మహిళా ఖైదీలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణనివ్వడంవల్ల జైలు జీవితం తరువాత ఉద్యోగావకాశాలు మెరుగుపడ్డాయి.