తెలంగాణ ముఖ్యాంశాలు

ఐటీ దాడుల వెనుక కొడుకు లగ్జరీ కోరికలే కారణమా

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు , కార్యాలయలపై సోదాల విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన బడా కాంట్రాక్టర్ కావడంతో టీడీఎస్ అవకతవకల విషయంలో సోదాలు జరిగాయని అనుకున్నారు. కానీ అసలు కారణం మాత్రం కుమారుడికి ఉన్న లగ్జరీ వాచ్‌ల మోజే. ఆ వాచ్‌లను నేరుగా కొనకుండా స్మగ్లింగ్ ద్వారా తెప్పించుకోవడమే అసలు తప్పిదంగా మారింది. ఈడీ కేసుల్లో ఇరుక్కునేలా చేసింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి వాచ్‌ల స్మగ్లింగ్‌లో కస్టమ్స్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్నారు. చెన్నై కస్టమ్స్ అధికారులు  ఓ వ్యక్తిని ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు. ఆ వ్యక్తి వద్ద రెండు ఖరీదైన వాచ్‌లుఉన్నాయి. పటెక్‌ ఫిలిప్‌, బ్రిగెట్‌ బ్రాండ్‌ లకు చెందిన వాచ్‌లు అవి.  అత్యంత ఖరీదైన ఆ  బ్రాండ్ వాచ్‌లు ఇండియాలో దొరకవు.  పట్టుబడిన వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తే.. వాటిని ఆలోకం నవీన్ అనే వ్యక్తి ద్వారా అవి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి తెప్పించుకుంటున్నారని గుర్తించారు.

రెండు వాచ్‌ల ఖరీదు మూడు కోట్ల వరకూ ఉంటుందని అంచనా.దీనిపై కేసు నమోదు చేసుకున్న చెన్నై కస్టమ్స్‌ అధికారులు విచారణ చేపట్టారు.  దర్యాప్తు చేసిన కస్టమ్స్ అధికారులు ఈ వాచ్‌ల కోసం బిట్ కాయిన్ల రూపంలో హర్షా రెడ్డి డబ్బు చెల్లించినట్లు సమాచారం. ముందుగా ఆలోకం నవీన్‌కుమార్‌ను విచారించిన చెన్నై కస్టమ్స్‌ అధికారులు చాలా కాలంగా ఈ లగ్జరీ వాచ్‌ల దిగుమతి జరుగుతోందని రూ. వంద కోట్ల విలువైన వాచ్‌లు తెప్పించినట్లగగాా చెప్పారు. దీంతో  హర్షా రెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు.కానీ హర్షా రెడ్డి వివిధ కారణాలతో హాజరు కావడం మానేశారు.  ఖరీదైన వాచ్‌లను పన్నులు కట్టకుండా… తీసుకు వచ్చే బిజినెస్ వ్యవస్థీకృతంగా నడుస్తూ ఉంటుందని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఈ క్రమంలో వివరాలను తెప్పించుకున్న ఈడీ అధికారులు బ్యాక్ గ్రౌండ్ వెరీఫికేషన్  పూర్తి చేసి.. వెంటనే దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎంత బయటపడ్డాయి అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

కానీ వాచ్‌ల స్మగ్లింగ్ విషయంలో ఈడీ అధికారులు సంచలన విషయాలు కనిపెట్టినట్లుగా చెబుతున్నరాు. అలాగే ఈ సోదాల్లో ఇంకా ఆయన వ్యాపారాలకు సంబంధించిన లొసుగులు ఏమైనా ఉన్నాయా అన్నది కనిపిస్తే అధికారిక  ప్రకటన చేయనున్నారు.   మొత్తంగా లగ్జరీ వాచ్‌లను పన్నులు కట్టకుండా ఇండియాలోకి తీసుకు రావడమే .. పొంగులేటిపై ఐటీ దాడులకు ప్రధాన కారణంగా మారింది.
పొంగులేటి ఇంట్లో భారీగా నగదు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు పెద్ద ఎత్తున నగదు లభించినట్లుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు మొదట ఓ నోట్స్ కౌంటింగ్ మెషిన్ ను తెప్పించుకున్నారు. ఓ గంట తర్వాత మరో మెషిన్ ను తెప్పించుకున్నారు. దీంతో నగదు లెక్కబెట్టడానికి పెద్ద మొత్తంలో ఉండటంతోనే ఇలా నోట్ల కౌంటింగ్ మెషిన్లను తీసుకెళ్లారని భావిస్తున్నారు.పొంగులేటి శ్రీనివాసరెడ్డి  బడా కాంట్రాక్టర్. ఆయనకు రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ తో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి. తమ గ్రూపునకు చెందిన  టీడీఎస్ కట్టకుండా.. ఎగ్గొట్టేందుక మూడు బోగస్ కంపెనీల నుంచి ఫేక్ లావాదేవీలు సృష్టించారన్న ఫిర్యాదులు రావడంతో ఈడీ అధికారులు పొంగులేటి కంపెనీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెబుతున్నారు. నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలతో.. కేంద్ర బలగాల రక్షణతో సోదాలు నిర్వహిస్తున్నారు.

మొత్తం పదిహేను చోట్ల సోదాలు జరుగుతుండటంతో.. రెండు రోజుల పాటు సాగవచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలక మంత్రి కావడంతో.. ఇక్కడ ఈడీ అధికారులకు కూడా సమాచారం లేకుండా.. కేంద్ర బలగాలతో సహా ఢిల్లీ నుంచి వచ్చి .. సోదాలు చేస్తున్నారు.  సోదాలు ముగిసిన తర్వాత ఈడీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి సోదాలు అంతర్గతంగా జరిగిపోతాయి. ఎలాంటి సమాచారం బయటకు ఇవ్వరు.  ఈడీ నేరుగా తాము ఫలానా వారిపై దాడులు చేశామని కూడా చెప్పదు. అయితే హైదరాబాద్‌లో దాడులు చేశామని ఇంత నగదు స్వాధీనం చేసుకున్నాం.. ఇన్ని అక్రమాలను గుర్తించామని మాత్రం ప్రకటిస్తూంటారు. దాన్ని బట్టి ఎంత దొరికిందని తేలే అవకాశం ఉంది.  కొన్నాళ్ల కిందట పొంగులేటి కుమారుడు విదేశాల నుంచి అతి ఖరీదైన వాచ్‌లను స్మిగ్లింగ్ ద్వారా తెప్పించుకున్నట్లుగా చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

వాచ్‌లను తీసుకు వస్తున్న ఇద్దర్ని గుర్తించి కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారు పొంగులేటి కమారుడి పేరు చెప్పారు. ఆ వాచ్‌లకు నగదును క్రిప్టో రూపంలో చెల్లించినట్లుగా గుర్తించారు. ఈ కేసులో విచారణకు కూడా సరిగ్గా  హాజరు కాలేదని తెలుస్తోంది. ఈడీ సోదాలు చేసిన కేసుల్లో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. పొంగులేటి ఇంట్లో జరుగుతున్న సోదాల విషయంలోనూ ఎలాంటి అరెస్టులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. మరో వైపు ఈ దాడుల్ని టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కమార్ గౌడ్ ఖండించారు. బీఆర్ఎస్,బీజేపీకుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే వేధిస్తున్నారని మండిపడ్డారు. పొంగులేటికి తాము అంతా అండగా ఉంటామన్నారు.