మాజీ మంత్రి రోజా సెల్వమణి వైసీపీ నేతల్లో ప్రస్తుతం అంతో ఇంతో యాక్టివ్‌గా ఉన్న నేతల్లో ఒకరు … పార్టీ ఓటమి తర్వాత బూతు మంత్రులు అనింపిచున్న వారంతా తెరమరుగైపోయినా… రోజా మాత్రం అప్పుడప్పుడు మీడియాలో ఫోకస్ అవుతున్నారు … అయితే రికార్డెడ్ వీడియోస్ రిలీజ్ చేస్తూ, ట్వీట్లకే పరిమితమవుతున్నారు .. దాంతో అసలు ఆమె ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారనేది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది… ఒకవైపు యాంకర్ శ్యామల వంటి వారు వైసీపీ అధికార ప్రతినిధి హోదాలో మీడియా ముందుకొస్తున్నా… రోజా మీడియాకు ముఖం చాటేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరులో బాలిక అదృశ్యమై హత్యకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ ఘటనపై తక్షణమే స్పందించిన ప్రభుత్వం హత్యకు కారణాలు గుర్తించి.. నిందితులను అరెస్ట్ చేయడంలో సక్సెస్ అయింది. ఆ బాలికను ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య చేశారని పోలీసులు ప్రకటించినా.. వైసీపీ నేతలు మాత్రం బాలికపై అత్యాచారం జరిగిందని రాద్దాంతం చేశారు.
కక్షపూరితంగా జరిగిన ఆ హత్యకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు.ఈ ఘటనపై మాజీ మంత్రి రోజా.. ప్రీ రికార్డెడ్ వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాల్లో చిన్నారులకు రక్షణ లేకుండా పోతుందని.. ఆడపిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తెగ భయమేస్తుందని తెగ ఆవేదన వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే పుంగనూరు బాలిక హత్యపై అంత రాద్దాంతం చేసిన వైసీపీ యూటర్న్ తీసుకుంది… బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ వస్తున్నారని ప్రకటించిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరుసటి రోజే జగన్ టూర్ రద్దైందని ప్రకటించారు. ప్రభుత్వం ఆ ఘటనపై సకాలంలో స్పందించిందని, అందుకే జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని వివరణ ఇచ్చారు.పెద్దిరెడ్డి అంత క్లారిటీ ఇచ్చినప్పటికీ రోజా తిరిగి ఆ ఘటనపై స్పందించలేదు. ఇంతలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన వెలుగు చూసింది.
బాలిక అపరస్మారక స్థితికి చేరుకోవడంతో నిందితులు ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా, స్థానికులు పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు. బాలిక బంధువు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదులోకి తీసుకున్నారు. దానిపై రోజా ట్విట్టర్లో స్పందించారు.‘డిప్యూటీ సీఎం సొంత ఇలాఖాలోనే ఓ మైనర్ బాలికపై దారుణం జరిగితే చర్యలు లేవు’’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు రోజా. అంతకు ముందు వరదల సమయంలో కూడా రోజా ప్రభుత్వ సహాయక చర్యలపై అవగాహన లేకుండా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం సహా మంత్రులు వరద నీటిలో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తుంటే. ప్రభుత్వ పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు మూట గట్టుకున్నారు.తర్వాత తిరుమల లడ్డూ వివాదంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి విమర్శలు మూట గట్టుకున్నారు స్పాట్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా నోటి దూకుడు ఏ స్థాయలో ఉండేదో అందరికీ తెలిసిందే. ఆ నోటి దూకుడు పార్టీకి తీవ్ర నష్టం చేసిందని వైసీపీ నేతలే అంటున్నారు.
అందుకే ఆమెకు జగన్ అధికార ప్రతినిధి హోదా కూడా ఇవ్వలేదని, అందుకే ఆమె ఉనికి కోసం రికార్డెడ్ వీడియోలు రిలీజ్ చేస్తూ.. ఎక్స్ వేదికగా రెచ్చిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.రోజా కంటే రాజకీయాల్లో జూనియర్లు, అసలు రోజాకు ఏ రకంగా సమఉజ్జీ కాని యాంకర్ శ్యామల వంటి వారి వైసీపీలో అధికార ప్రతినిధి హోదా దక్కింది. శ్యామల రాజకీయంగా ఉనికి చాటుకోవడానికి ప్రెస్ మీట్లు పెడుతూ హడావుడి చేయాలని చూస్తున్నారు. అయితే సొంత సెగ్మెంట్ నగరిలో కనీసం అడుగుపెట్టలేకపోతున్న రోజా ఓటమి తర్వాత తెరచాటు రాజకీయాలకే పరిమితమవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.