కేసీఆర్.. మూడు అక్షరాల ఈ పదం ఓ సంచలనం. ఆయనే ఓ సైన్యం. అతడే ఆ పార్టీకో నమ్మకం. అలాంటి దళపతి మీడియాలో కనిపించకపోవడం.. తెలంగాణ భవన్‌కు రాకపోవడం క్యాడర్ లోటుగా ఫీల్ అవుతుందట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాలి తుంటికి గాయం కావడంతో రెస్ట్ తీసుకున్నారు కేసీఆర్. గాయం నుంచి పూర్తిగా కోలుకోక ముందే..కృష్ణాజలాల్లో అన్యాయం జరుగుతుందంటూ నల్గొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ రోజు సభకు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్యాడర్, లీడర్లతో అప్పుడప్పుడు ఫాంహౌస్‌లో పిచ్చాపాటి సమావేశాలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు కేసీఆర్. ఎవరైనా ముఖ్యనేతలు కలవాలన్నా అక్కడికే పిలిపించుకుని మాట్లాడుతున్నారు. గులాబీ బాస్ సైలెంట్‌గా ఉండటంపై క్యాడర్ ఆందోళన చెందుతుందట. అధినేత మౌనంగా ఉండటంపై పార్టీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
రుణామాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో పాటు..హైడ్రా, మూసీ ప్రక్షాళనపై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు జనంలోనే ఉంటున్నారు. కేసీఆర్ మాత్రం ఎక్కడా నిరసనల్లో పాల్గొనడం లేదు. ప్రెస్‌నోట్లు కూడా ఇవ్వడం లేదుగజ్వేల్ ప్రజలు కూడా కేసీఆర్ నియోజకవర్గానికి రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పది నెలలుగా కేసీఆర్ గజ్వేల్‌కు వెళ్లకపోవడంతో వెయ్యికిపైగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ పెండింగ్‌లోనే ఉండిపోయాయన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఫాంహౌస్ నుంచి ఎందుకు బయటికి రావడం లేదంటూ సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నా లైట్ తీసుకుంటున్నారు గులాబీ బాస్. కేటీఆర్, హరీశ్‌రావు, మా సోషల్ మీడియానే తట్టుకోలేకపోతున్నావ్..ఇక బాస్ దిగితే ఫేస్ చేయగలవా అని ఎదురు దాడి చేస్తోంది బీఆర్ఎస్.
పార్టీ వ్యవహారాలు, ప్రజా సమస్యలపై కేటీఆర్, హరీశ్ రావులు ఎంత సీరియస్‌గా పనిచేస్తున్నా కేసీఆర్ తెరమీద కనిపించని లోటు మాత్రం స్పష్టంగా ఉందట. సార్ బయటికి వస్తేనే పార్టీలో జోష్ వస్తుందని అనుకుంటున్నారట. ఇన్ని ఇష్యూస్ ఉన్నా కేసీఆర్ యాక్టివ్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు కొందరు బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన మేలేంటో..నష్టమేంటో ప్రజలకే అర్థం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట.ఏడాది సమయం ఇచ్చి విమర్శించినా ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంటుందని.. ఆలోపే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయొద్దని గులాబీ బాస్ అనుకుంటున్నారట. డిసెంబర్ తర్వాత దళపతి ఫీల్డ్‌లోకి దిగుతారని అంటున్నారు. అప్పటి నుంచి రెగ్యులర్‌గా పార్టీ క్యాడర్, లీడర్లతో రెగ్యులర్‌గా మాట్లాడుతారని..పార్టీ యాక్టివిటీ ఇంకా పెరిగిపోతుందని చెబుతున్నారు.