యుద్ధాలతో దేశాల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కారం లభించదని.. చర్చలు, దౌత్య విధానాల ద్వారా మాత్రమే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. వియత్నాంలో జరుగుతున్న తూర్పు ఆసియా దేశాల సమావేశాల్లో శుక్రవారం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న వేర్వేరు యుద్ధాల వల్ల గ్లోబల్ సౌత్ దేశాలకు నష్టం వాటిల్లుతోందని.. యుద్ద ప్రభావాలు నిలువరించడానికి ఇండో పసిఫిక్ ప్రాంతంలో అడ్డులేకుండా వాణిజ్యం చేసుకోవడానికి కొన్ని నిబంధనలు రూపొందించాల్సిన అవసరముందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.వియత్నాం తూర్పు ఆసియా సమావేశాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ” ప్రపంచంలోని వివిధ భాగాల్లో జరుగుతున్న యుద్ధాలు, ఘర్షణలు గ్లోబల్ సౌత్ దేశాలపై విపరీత ప్రభావం చూపుతున్నాయి. అందరూ యూరోప్, ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో త్వరగా శాంతి, స్థిరమైన పరిస్థితులు ఏర్పడాలని కోరుకుంటున్నారు. నేను బుద్ధుడు పుట్టిన దేశం నుంచి వచ్చాను. అందుకే ఇది యుద్ధాల యుగం కాదని నమ్ముతున్నాను. సమస్యలకు పరిష్కారం యుద్దరంగంలో లభించదు.
ప్రతి దేశం ఇతర దేశాల సార్వభౌమత్వం, సరిహద్దులు, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. సమస్యలు వస్తే దౌత్య విధానాలతో, మానవీయ కోణంలో చర్చల ప్రాధాన్యం ఇవ్వాలి. శాంతి స్థాపన కోసం భారత దేశం ఎప్పుడూ తన సహకారం అందిస్తూనే ఉంటుంది.సముద్ర మార్గంలో వాణిజ్యానికి ఏ అడ్డులేకుండా ఉండేందుకు అన్ని దేశాలు ఐక్యారాజ్యసమితి సముద్ర చట్టాలను(UNCLOS) పాటించాలి. ఇండో పసిఫిక్ ప్రాంతానికి.. సౌత్ చైనా సముద్రంలో శాంతి, స్థిరత్వం చాలా ముఖ్యం. అందుకే ఇండో పసిఫిక్ దేశాలు అభివృద్ధి, సంక్షేమం కోసం కొన్ని నియమాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెద్ద సవాల్ గా మారింది. ప్రపంచదేశాలన్నింటినీ మానవత్వం కోసం కలిసి చేస్తే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.” అని అన్నారు.21 వ ఆసియన్ ఇండియా సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లావోస్ దేశానికి రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. సమావేశాల్లో ఆయన అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ను కలిశారు. ఇటీవల అమెరికాలో మిల్టన్ తుఫాన్ కారణంగా 14 మంది మృతిచెందారు. తుఫాను ప్రభావంతో మృతిచెందిన వారి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
మోడీ అరుదైన గిఫ్ట్…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లావాస్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం లావోస్ జరుగుతున్న 21వ ఆసియాన్ ఇండియా, 19వ తూర్పు ఆసియా సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆసియాన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో 10 ASEAN సభ్య దేశాలు, ఎనిమిది భాగస్వామ్య దేశాలు హాజరయ్యాయి.. ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, రష్యా, అమెరికా ఈ సదస్సులో పాల్గొన్నాయి. మిల్టన్ హరికేన్ కారణంగా చనిపోయినవారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాల అధినేతలు, పలువురు ప్రముఖులు, ప్రతినిధులతో ప్రధాని భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని మోదీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జ్ఞాపికలను అందజేశారు. లావోస్ అధ్యక్షుడు థోంగ్లోన్ సిసౌలిత్, న్యూజిల్యాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌కు కలకాల గుర్తుండిపోయేలా జ్ఞాపికలను అందజేశారు.భారతదేశం- లావో మధ్య సంబంధాలను బలోపేతం చేసే విషయంపై లావోస్ ప్రధాని సోనెక్సే సిఫాండోన్‌తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు.
శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చినందుకు సిఫాండోన్‌ను ప్రధాని మోదీ అభినందించారు.అనంతరం ప్రధాని మోదీ శుక్రవారం లావోస్ అధ్యక్షుడు థోంగ్లోన్ సిసౌలిత్‌తో కూడా భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడానికి నిబద్ధతను తెలియజేశారు. ఆర్థిక, రక్షణ రంగాలతోపాటు సంస్కృతి, ఇరు దేశాల మధ్య సంబంధాలు, అభివృద్ధి భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. లావోస్ అధ్యక్షుడు థోంగ్లోన్ సిసౌలిత్ కి పురాతన కాలానికి సంబంధించిన అద్భుతమైన బుద్ధుని ఇత్తడి విగ్రహం అందించారు.. ప్రాచీనకాలానికి సంబంధించిన బుద్ధుని విగ్రహం.. ఇత్తడితో తయారు చేసి మీనా వర్క్ తో రూపొందించారు. ఇది ఈ పాతకాలపు ఇత్తడి బుద్ధ విగ్రహాన్ని తమిళనాడులో తయారు చేసినది.. ఈ బుద్ధుని విగ్రహాన్ని క్లిష్టమైన మినా (ఎనామెల్) పనితో దీన్ని అలంకరించారు. నైపుణ్యం కలిగిన కళాకారులతో రూపొందించబడిన ఈ విగ్రహం దక్షిణ భారత హస్తకళ, బౌద్ధ తత్వశాస్త్రం సారాంశాన్ని కలిగి ఉంటుంది.