ఆంధ్రప్రదేశ్ జాతీయం ముఖ్యాంశాలు

అమ్మవారి దర్శనానికి రావడం సంతోషంగా ఉంది

విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న పీవీ సింధు

ఒలింపిక్‌ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి ద‌ర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన‌ అనంతరం పండితులు పీవీ సింధుకు వేదాశీర్వచనం అందించారు.

ఆ త‌ర్వాత పీవీ సింధుకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ.. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లేముందు తాను క‌న‌క‌దుర్గమ్మను దర్శించుకున్నానని, అమ్మవారి ఆశీస్సులతో పోటీల్లో నెగ్గి పతకం సాధించాన‌ని చెప్పింది. అమ్మవారి దర్శనానికి రావడం సంతోషంగా ఉందని తెలిపింది. ‘ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉన్నాయని, 2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడాలి.. ఈసారి స్వర్ణం సాధించాలి’ అని పేర్కొంది. కాగా, పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం గెలిచిన విష‌యం తెలిసిందే.