హైడ్రా స్పీడ్ తగ్గిందా? లేక తెర వెనుక పని చేసుకుంటూ పోతోందా? రెండు వారాలుగా హైదరాబాద్‌లో హైడ్రా ఎందుకు సైలెంట్ అయ్యింది? నగరంలో అక్రమ కట్టడాల మాటేంటి? ఇలా రకరకాల ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చింది హైడ్రా వ్యవస్థ. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేరుతో వచ్చింది. మొదట్లో యమ దూకుడు ప్రదర్శించింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా సైలెంట్ అయిపోయింది. ఇందుకు కారణమేంటి?హైడ్రా తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఇప్పటివరకు కూల్చిన వ్యర్థాలను తొలగించిన నిర్మాణదారుణలకు నోటీసులు ఇచ్చింది. రెండు నెలల కిందట అంటే ఆగస్టు 14న నిజాంపేట్ ఎర్రకుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఐదు అంతస్తుల భవనాలను మూడింటిని నేల కూల్చింది. హైడ్రా తన పని తాను చేసుకుపోయింది. వ్యర్థాల్లో ఉన్న ఐరన్‌ను తీసుకెళ్లారు.
వ్యర్థాలను అక్కడే వదిలేసి సైలెంట్ అయ్యారు నిర్మాణదారులైన బిల్డర్లు. ఈ వ్యవహారంపై హైడ్రా దృష్టి పెట్టింది. కూల్చిన వ్యర్థాలను తొలగించాలంటూ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఎర్రకుంట చెరువులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తోంది హైడ్రా. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు నాలాలపై హైడ్రా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా సిటీలో వర్షం పడినప్పుడు పలు ప్రాంతాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలాలను పరిశీలించారు.. వాటిలో చాలా వరకు చెత్త చెదారంతో మూసుకుపోయాయి. దానిపై అక్రమ షాపులు వెలిశాయి.అలాగే ట్రాఫిక్ జామ్ అవుతున్న ఏరియాల్లో ఫుట్‌పాత్‌లపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించి, అక్రమ కట్టడాలు అడ్డుకోగలిగితే ఎలాంటి వరదలు వచ్చినా కొంతలో కొంత హైదరాబాద్ సేఫ్ అవుతుందని అంటున్నారు
కార్యాచరణ సిద్ధం చేస్తున్న హైడ్రా
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలన్నది ఆలోచన. మొదటి దశ పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే రెండో దశ కార్యాచరణ మొదలుపెట్టాలని భావిస్తోంది.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై చకచకా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ నదీ గర్భంలో 1600 ఇళ్లు, బఫర్ జోన్‌లో 13 వేళ ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తిం చారు. అయితే బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతోపాటు పరిహారం కిందట 25 వేల రూపాయలను ఇచ్చింది ప్రభుత్వం. అంతేకాదు ఉపాది కోసం 2 లక్షల లోన్లను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెల్సిందే.ఇదికాకుండా ఇంటి స్థలం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ఆలోచన. ఔటర్ రింగ్ రోడ్డు నాలుగు వైపులా ఇళ్ల స్థలాలను ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై ఈనెల 26న జరగనున్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.కుటుంబానికి 150 నుంచి 200 గజాల చొప్పున ప్లాన్ ఇవ్వాలని భావిస్తోంది. మార్కెట్లో ఆ స్థలం విలువ అక్షరాలా 25 లక్షల పైమాటేనని అధికారులు అంటున్నారు. వీటి కోసం 600 ఎకరాలు అవసరమని అంచనా వేస్తోంది. ఒకవిధంగా చెప్పుకోవాలంటే మూసీ నిర్వాసితులకు ఇదొక బంపరాఫర్ అన్నమాట.హైదరాబాద్ చుట్టు పక్కల చాలా చోట్ల ప్రభుత్వ భూములున్నాయి. అందులో ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నవి ఉన్నాయి.
ఆయా భూములనే ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు చెబుతున్నారు.మొదటి దశ పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే రెండో దశ కార్యాచరణ మొదలు పెట్టాలని భావిస్తోంది. తొలి దశలో మూసీకి ఇరువైపులా రిటెయినింగ్ వాల్ నిర్మించాలనే యోచనలో ఉంది. వాల్ మధ్యలో ఉన్న మూసీ నదిని శుద్ధి చేసి అటూ సుందరీకరణ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. బఫర్ జోన్‌లో మూసీ నది వెంబడి 55 కిలోమీటర్ల మేరా రెండు వైపులా రోడ్లను నిర్మించనుంది. అటు ఇటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.