టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయ గోల్ఫర్ అదితి అశోక్‌కు తృటిలో పతకం కోల్పోయింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో అదితికి నాలుగవ స్థానం దక్కింది. నాలుగవ రౌండ్‌లో అదితి వెనుకబడడంతో.. ఆమెకు మెడల్ దక్కే అవకాశం మిస్సైంది. నిజానికి టోక్యో క్రీడల్లో అదితి అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ఊహించని రీతిలో ఆమె దూసుకువెళ్లింది.
మూడవ రౌండ్ వరకు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గోల్ఫర్ అదితి అశోక్.. చివర్లో కాస్త తడబడింది. ఇవాళ జరిగిన కీలకమైన నాలుగవ రౌండ్‌లో ఓ దశలో న్యూజిలాండ్ గోల్ఫర్‌తో సమానంగా నిలిచింది. కానీ రసవత్తరంగా సాగిన గోల్ఫ్ ఆటలో.. అమెరికాకు చెందిన కోర్డా నెల్లి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నది.