భారత్‌లో విధ్వంసాలు సృష్టించి అశాంతి నెలకొల్పడం, ఆర్థికంగా పతనం చేయడమే తమ ఏకైక విదేశీ విధానంగా దాయాది దేశం పాకిస్తాన్ పెంచి పోషించిన సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఏదో ఒక రూపంలో ఉగ్రవాద ముప్పు ఎదుర్కుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్‌కు ఈ ముప్పు కొన్ని దశాబ్ధాలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై సహా దేశంలోని అనేక నగరాలు ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఎదుర్కొన్నాయి. వందల మంది ప్రాణాలను పొట్టన బెట్టుకున్నాయి. ప్రజాస్వామ్య దేవాలయం అయిన పార్లమెంట్‌పైనే ఉగ్రవాదులు దాడికి తెగబడ్డ ఘటనలను దేశం చూసింది. ముంబై మారణహోమం యావత్ ప్రపంచాన్నే ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
ఎప్పుడు ఏ రూపంలో ఉగ్రమూక దూసుకొస్తుందో నిఘాకు చిక్కడం లేదు. పాకిస్థాన్ ఆర్మీ సహకారంతో.. ఉగ్రవాద సంస్థలన్నీ ఉమ్మడి కుట్రలతో భారత దేశాన్ని టార్గెట్ చేస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వేదికగా చేసుకుని.. ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. వరుస ఉగ్రవాద దాడుతలో అలజడి సృష్టిస్తున్నాయి. భారతదేశంలో ఉగ్రవాద సమస్య విస్తరిస్తున్న క్యాన్సర్ లా మారుతోంది. కశ్మీర్ లోయలో మొదలైన ఈ సమస్య ఇప్పుడు భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు పాకింది. ఎన్ఐఏచే నిషేధించబడిన భారతదేశంలోని ఉగ్రవాద సంస్థల ఇవే
ఎన్ఐయే నిషేధించిన తీవ్రవాద గ్రూపుల జాబితా
* బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్
* ఖలిస్తాన్ కమాండో ఫోర్స్
* ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్
* అంతర్జాతీయ సిక్కు యూత్ అసోసియేషన్
* లష్కర్-ఏ-తైబా/పస్బాన్-ఏ-అహ్లే హదీస్
* జైష్-ఎ-మొహమ్మద్/తెహ్రీక్-ఎ-ఫుర్కాన్
* హర్కత్-ఉల్-ముజాహిదీన్ లేదా హర్కత్-ఉల్-అన్సార్ లేదా హర్కత్-ఉల్-జిహాద్-ఇ-ఇస్లామీ లేదా అన్సార్-ఉల్-ఉమ్మా (AUU)
* హిజ్బ్-ఉల్-ముజాహిదీన్/హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ పీర్ పంజాల్ రెజిమెంట్
* అల్-ఒమర్-ముజాహిదీన్
* జమ్మూ కాశ్మీర్ ఇస్లామిక్ ఫ్రంట్
* యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA)
* అస్సాంలో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (NDFB).
* పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)
* యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF)
* కంగ్లీపాక్ పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ (PREPAK)
* కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (KCP)
* కంగ్లీ యాయోల్ కాన్బా లూప్ (KYKL)
* మణిపూర్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (MPLF)
* ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్
* నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర
* లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE)
* స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా
* దీందర్ అంజుమన్
* కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) – పీపుల్స్ వార్, దాని అన్ని సంస్థలు .. ఫ్రంట్ సంస్థలు
* మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ (MCC), దాని అన్ని సంస్థలు .. ఫ్రంట్ సంస్థలు
* అల్ బదర్
* జమియత్-ఉల్-ముజాహిదీన్
* భారత ఉపఖండంలో అల్-ఖైదా/అల్-ఖైదా (AQIS) .. దాని అన్ని అనుబంధ సంస్థలు
* దుఖ్తరన్-ఎ-మిల్లత్ (DEM)
* తమిళనాడు లిబరేషన్ ఆర్మీ (TNLA)
* తమిళ నేషనల్ రిట్రీవల్ ట్రూప్స్ (TNRT)
* ఆల్ ఇండియా నేపాలీ యూనిటీ సొసైటీ (ABNES)
* కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) దాని అన్ని సంస్థలు .. రాబోయే సంస్థలు
* ఇండియన్ ముజాహిదీన్, దాని అన్ని సంస్థలు.. రాబోయే సంస్థలు
* గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ (GNLA), దాని అన్ని శాఖలు.. తదుపరి సంస్థలు
* కమ్తాపూర్ ముక్తి సంగతన్, దాని అన్ని సంస్థలు .. రాబోయే సంస్థలు
* ఇస్లామిక్ స్టేట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ .. లెవాంట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్.. లెవాంట్
* ఖొరాసన్ ప్రావిన్స్‌లోని సిరియా/దైష్/ఇస్లామిక్ స్టేట్ (ISKP)/ISIS విలాయత్ ఖొరాసన్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్.. షామ్-ఖొరాసన్ (ISIS-K) దాని అన్ని అనుబంధ సంస్థలు
* నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఖప్లాంగ్) [NSCN(K)], దాని అన్ని సంస్థలు మరియు తదుపరి సంస్థలు
* ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ దాని అన్ని సంస్థలు
* తెహ్రీక్-ఉల్-ముజాహిదీన్ దాని అన్ని సంస్థలు
* జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ లేదా జమాత్-ఉల్-ముజాహిదీన్ ఇండియా లేదా జమాత్-ఉల్-ముజాహిదీన్ హిందుస్థాన్ దాని అన్ని సంస్థలుఇక్కడ ఇవ్వబడిన సమాచారానికి మూలం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారిక వెబ్‌సైట్. మీరు క్రాస్ చెక్ చేయాలనుకుంటే ఆ వెబ్ సైట్లోకి వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.