ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు సోషల్‌మీడియా చుట్టే తిరుగుతున్నాయ్. హద్దులు దాటి పోస్టులు చేస్తూ.. బూతులతో టార్గెట్ చేస్తూ.. కుటుంబాలను లాగుతున్న సోషల్ మీడియా జాదూలకు.. ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇక అటు వైసీపీకి చెందిన కొందరు నేతలను కూడా అరెస్ట్ చేశారు. డైరెక్టర్ రాంగోపాల్‌వర్మతో పాటు.. వైసీపీ నేత పోసాని, సానుభూతిపరురాలు శ్రీరెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు.చంద్రబాబు, పవన్, లోకేశ్‌తో పాటు.. హోంమంత్రి అనితపై.. సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని వీరిపై కేసులు నమోదు కాగా.. వీరి అరెస్ట్‌కు దాదాపు రంగం సిద్ధం అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఐతే సోషల్‌మీడియా అరాచకాలకు చెక్ పెట్టేలా ఏపీ సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చేందుకు రెడీ కావడం.. సరికొత్త సంచలనానికి కారణం అవుతోంది.సోషల్‌మీడియా దారుణాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొదటి నుంచి ఫోకస్ పెట్టారు. కుటుంబసభ్యులను లాగుతూ అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని.. తన కూతుళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారంటూ.. కేబినెట్ మీటింగ్ సాక్షిగా పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పుడు మొదలైన పోలీసుల వేట.. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ ఉన్నా సరే.. లాగి పట్టుకొచ్చి మరీ ఊచలు లెక్కిస్తున్నారు పోలీసులు.విదేశాల్లో ఉన్నా వదిలేది లేదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై.. కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత.. BNSS 179 అమలు చేస్తున్నారు. ఇక సోషల్‌మీడియా పోస్టులపై నోటీసులు ఇవ్వడంలో తప్పేంటని.. జడ్జిల్లోనూ బాధితులు ఉన్నారన్న హైకోర్టు తీర్పుతో.. పోలీసులు మరింత దూకుడు చూపిస్తున్నారు. అసభ్య పోస్టులు, వాటిని పోస్ట్ చేసే వాళ్ల అంతుచూసే పనిలో పడ్డారు.సోషల్‌మీడియా ఆగడాలకు పూర్తిగా చెక్ పెట్టేలా.. డిప్యూటీ సీఎం పవన్ ఓ కీలక ప్రతిపాదనను తెర మీదికి తీసుకొచ్చారు. సోషల్ మీడియా దూకుడుకు బ్రేకులు వసేలా కొత్తగా ఓ చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉందని.. దీనికి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టాలని సూచించారు. సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ తేల్చి చెప్పారు.
హోంమంత్రిని కూడా వదలట్లేదని, మహిళ అని కూడా చూడకుండా ఆమెను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్ పూర్తిగా దుర్వినియోగం అవుతోందని.. ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ప్రతిపాదించారంటే.. దాదాపు ఆ చట్టం వచ్చేసినట్లే అనే చర్చ జరుగుతోంది.సోషల్‌మీడియాలో బూతులు, అసభ్య మెసేజ్‌ల వ్యవహారం జనాల్లోకి చొచ్చుకెళ్లిందనే చర్చ జరుగుతోంది. సోషల్‌మీడియా సాక్షిగా అభిప్రాయాలు చెప్పడం కూడా తప్పా అని ప్రశ్నించిన వాళ్లు కూడా.. ఆ దారుణాలు చూసి అంతు చూడాల్సిందే అంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. పవన్ ప్రతిపాదనపై పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. రాజకీయ వర్గాలు, సినీ ప్రముఖులు, సాంకేతిక రంగం నుంచి కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.రాజకీయాలు మాత్రమే కాదు.. సినిమా, వ్యాపారం నుంచి సామాన్యుల వరకు.. ప్రతీ ఒక్కరు సోషల్‌మీడియా బాధితులే అన్న మాటను.. జనాల్లోకి ఏపీ సర్కార్ సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్లింది. దీంతో పవన్ ప్రతిపాదించిన సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లును తీసుకురావాల్సిందేననే డిమాండ్‌లు కూడా వినిపిస్తున్నాయ్. దీంతో ఈ చట్టం త్వరలో అమల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
పవన్ ఓ అంశాన్ని లేవనెత్తడం.. చంద్రబాబు యాక్షన్‌లోకి దిగడం.. పర్ఫెక్ట్ కో ఆర్డినేషన్‌తో.. ఈ ఇద్దరు ఒక్కో సమస్యకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇక పవన్ ప్రతిపాదించిన బిల్లు అమల్లోకి వస్తే.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ చేసే వారికి చుక్కలే. అరెస్టుల తర్వాత ఇప్పటికే సోషల్‌మీడియాలో ప్రతీ ఒక్కరు అలర్ట్ అయ్యారు. ఈ చట్టం వస్తే.. వేధింపుల సంస్కృతికి పూర్తిగా చెక్ పెట్టొచ్చన్నది ఏపీ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది.