వైసీపీ రెండు గ్రూపులుగా చీలిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఓడిపోవడానికి సజ్జల వ్యవహారశైలి కారణమంటూ ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు. కొందరైతే ఆ పార్టీకి రాం రాం చేప్పేశారు. మళ్లీ సజ్జలను రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా నియమించారు జగన్. దీంతో నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.దెబ్బ తిన్న ఫ్యాన్‌కి రిఫేర్ చేయడానికి మంచి మెకానిక్ వస్తారని నేతలు, కార్యకర్తలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. మళ్లీ పాత మెకానిక్‌కే ఇచ్చారన్న భావన నేతల్లో మొదలైంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖమంత్రిగా పేరు పొందారాయన.అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడపడం, ప్రభుత్వ నిర్వహణలో సజ్జల ఫెయిల్ అయ్యారని, అందువల్లే 11 సీట్లకు పరిమితమయ్యామని ఆ పార్టీ నేతలు ఓపెన్‌గా విమర్శలు గుప్పించారు. 2014-19 సమయంలో విజయసాయిరెడ్డి హార్డ్‌గా పని చేశారని, ఆయన వల్ల అధికారంలోకి వచ్చిందని కొందరు నేతల మాట.ఈసారి వీఎస్ఆర్‌కే కీలక పగ్గాలు అప్పగిస్తారని చాలామంది నేతలు భావించారు. ప్రస్తుతం జగన్ విశ్వాసానికే జగన్ పెద్ద పీట వేసినట్టు కనిపిస్తోంది.
ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు ఆరుగురు కో- ఆర్డినేటర్లను నియమించింది వైసీపీ. వారంతా సజ్జల ఆధీనంలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీనిపై కొందరు సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించడం తేలికే.. పవర్ లేనప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడమన్నది ఆశామాషీ కాదని అంటున్నారు.కీలక విషయాల్లో సజ్జల ఏ విధంగా సక్సెస్ అవుతారనేది ఇప్పుడు అసలు విషయం. ప్యాన్ పార్టీకి కొత్త మెకానిక్ రావడంతో ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికర అంశం. వైసీపీ ఏది చెయ్యాలన్నా కచ్చితంగా జగన్ తెలియాల్సిందే. ఆయనకు తెలీకుండా ఏ పని జరగదన్నది కొందరి మాట. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
తమిళనాడు సెంటిమెంట్ పై ఆశలు
మరోసారి అధికారంలోకి వస్తామని జగన్ ధీమాతో ఉన్నారు.ఎట్టి పరిస్థితుల్లో కూటమి పాలనలో ఫెయిల్ అవుతుందని.. సంక్షేమ పథకాలు అనుకున్న స్థాయిలో అందించలేదని..అప్పుడు ప్రజా వ్యతిరేకత పెరిగి వైసిపి వైపు ప్రజలు వస్తారన్నది జగన్ ధీమా.అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది.175 సీట్లకు గాను 11 స్థానాలకే పరిమితం అయింది.కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. దీంతోపార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతున్నారు. కూ టమి పార్టీల్లో అవకాశం లేని వారు రాజకీయాలను విడిచి పెడుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఫల్యాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాటిని బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా వైసిపి పాలనలో రెచ్చిపోయిన సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భూ భూ ఆక్రమణలను బయటకు తీసి దాని వెనుక ఉన్న వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసేందుకు ఉపక్రమిస్తోంది. ఈ తరుణంలో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
ఆ పార్టీ శ్రేణులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ జగన్ మాత్రం తన పని తాను చేసుకు పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.అయితే రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు మూడు ఎన్నికలు జరిగాయి. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా చంద్రబాబు వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. వైసిపి పోరాటం కనబరిచి.. అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. కానీ 2014 నుంచి 2019 మధ్య గట్టిగానే పోరాడింది. దాని ఫలితంగా 2019లో తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చింది వైసిపి. కానీ ఈ ఎన్నికల్లో అంతే దారుణంగా ఓడిపోయింది. దీంతో తమిళనాడు సెంటిమెంటును ఏపీ ప్రజలు కూడా కొనసాగించినట్లు అయ్యింది. ప్రతి ఐదు సంవత్సరాలకు పార్టీని మార్చినట్లు అయ్యింది. దీంతోనే వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం అన్న ధీమాతో జగన్ ఉన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా చంద్రబాబు వ్యవహరించారు. తరువాత జగన్ సీఎం అయ్యారు.
అయితే చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు జగన్. వన్ చాన్స్ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ గత ఐదేళ్ల వైసిపి పాలనలో కొన్ని రకాల నిర్ణయాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు జగన్. అయితే 2014 నుంచి 2019 మధ్య, అదే గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఎదురైన అనుభవాలను.. పరిగణలోకి తీసుకుంటున్న చంద్రబాబు అభివృద్ధితోపాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ జగన్ కు అవకాశం ఇవ్వరని భావిస్తున్నారు. గతం మాదిరిగా ప్రజలు వ్యవహరించరని.. విజ్ఞతతో ఓటు వేసి మళ్లీ కూటమికే ఛాన్స్ ఇస్తారని చంద్రబాబు ధీమాతో ఉన్నారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇరువురు నేతలు ఊహల పల్లకిలో ఉన్నారు. మరి ఎవరు నెగ్గుకు రాగలరో చూడాలి.