రుకు ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు..చేసేదంతా పార్టీ ప్రచారం. ప్రచారమంటే అది మామూలు ప్రచారం కాదు. విషం చిమ్మడే పని అంటున్నారు. సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు, వికృత వీడియోలు, అడ్డగోలు కామెంట్స్ పెట్టడమే వాళ్ల డ్యూటీ అంట. ఆఫీస్‌కు పోవాల్సిన పనిలేదు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎక్కడ ఉన్నా ప్రాపగండ చేస్తే చాలంటూ వాళ్లకు బాధ్యత అప్పగించారట. కట్ చేస్తే లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ రెచ్చిపోయి నోళ్ల తిక్క కథలు అంతా ఇప్పుడు బయటికి వస్తోంది. ఇలా కూడా చేయొచ్చా అన్నట్లుగా..ఓ మూడు కార్పోరేషన్ల నుంచి..ప్రభుత్వ డబ్బును ప్రసాదంలా పంచేశారట. సర్కార్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాల్సిన కార్పొరేషన్ నుంచి నెలనెలా ప్రజాధనాన్ని జీతం ఇస్తూ..కూటమి నేతలు, వారి కుటుంబసభ్యుల మీద నీచమైన పోస్టులు పెట్టించారట. ఇదంతా వైసీపీ పెద్ద లీడర్ల డైరెక్షన్‌లో జరిగిందని..అప్పుటి విషనాగుల వివరాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని చెప్తున్నారు కూటమి నేతలు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటంబసభ్యులే కాదు..వైఎస్ షర్మిల, సునీతా మీద అడ్డగోలుగా, అసభ్యంగా పోస్టులు పెట్టిన పలువురిని..కొద్ది రోజులుగా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు పోలీసులు. అందులో కొందరిని విచారించగా అసలు విషయం బయటికి వచ్చిందట. కూటమి పార్టీల నేతలు, వారి కుటుంబసభ్యుల మీద పోస్టులు పెట్టే వ్యవహారం ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా నడిచిందని గుర్తించారట. పక్కా ప్లాన్‌తో వైసీపీ పెద్దల డైరెక్షన్‌లో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు అందరికీ పోస్టర్లు డిజైన్ చేసి పంపిస్తారని..వాటిని వాళ్లు సోషల్ మీడియాలో పెడతారని పోలీస్ విచారణలో తేలిందట. అలా పోస్టులు పెట్టినందుకు కొందరికి అయితే లక్షలకు లక్షలు జీతాలు ఇచ్చారట. ఈ విషయాన్ని అరెస్ట్ అయిన వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లే పోలీసులకు చెప్పడంతో..ఈ మ్యాటర్ తెలిసి కూటమి నేతలు షాక్ అయినట్లు తెలుస్తోంది.కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి కేసులో పోలీసులు తీగ లాగితే సోషల్ మీడియా పోస్టుల బాగోతం కథ మొత్తం బయటపడినట్లు చెబుతున్నారు.
మొత్తం 46 మందిని నిందితులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరంతా నెలనెలా ప్రభుత్వ నుంచి జీతాలు తీసుకుంటూ..అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులైన మహిళల మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర, నీచమైన కామెంట్స్‌తో ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలిందంటున్నారు. ఈ 46 మందిలో 30 మంది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు తీసుకున్నట్లు విచారణలో గుర్తించారట. మిగిలిన వారికి ఏపీ ఈ ప్రగతి ఏపీ ఫైబర్ నెట్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ నుంచి శ్యాలరీస్ ఇచ్చారని అంటున్నారు. నిందితుల్లో 30 వేల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు జీతాలు తీసుకున్నారని..అందులో ముగ్గురికి రెండు లక్షల 80 వేల జీతం 50 వేల రూపాయలు ఇతర అలవెన్స్ కూడా ఇచ్చినట్లు టాక్. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 130 మంది ఉద్యోగులతో డిజిటల్ మీడియా కార్పొరేషన్‌ను రన్ చేసిన వైసీపీ..వాళ్లందరినీ పార్టీ ప్రచారం కోసం, ప్రత్యర్థుల మీద దుష్ప్రచారం చేసేందుకు వాడుకుందంటున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా తాడేపల్లిలోని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఆఫీస్‌లో తనిఖీలు చేసిన కడప పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డి డైరెక్షన్‌లో..పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందనేది కూటమి నేతల ఆరోపణ. ఆయనకు సన్నిహితులుగా ఉన్నవారు, వైసీపీ మద్దతుదారులకు నెలనెలా జీతాలు ఇచ్చి..అడ్డగోలుగా పోస్టులు పెట్టించేవారని పోలీసుల దర్యాప్తులో తేలిందంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా కేంద్రంగా తయారయ్యే పోస్టులను..పోస్ట్ చేయడమే వీళ్ల పని అంటున్నారు. నిందితుల్లో ఎక్కువ మంది ఒకే సామాజికవర్గం వారు ఉన్నారంటున్నారు కూటమి నేతలు. వాళ్లందరికీ బంధుత్వం కూడా ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఇలా కడప పోలీసుల దర్యాప్తులో బయటికి వచ్చిన బాగోతం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటోంది.ఇప్పటికే అసభ్యకర పోస్టులు, మహిళలను కించపరిచారంటూ కేసులు నమోదు అవుతుంటే..ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం మీద ఉన్నతస్థాయి విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సెగ ఏకంగా వైసీపీ పెద్ద నేతల దాకా వెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు.
కార్పొరేషన్ల ఏర్పాటు చేసింది ఎందుకోసం? వాళ్లందరినీ ఉద్యోగులుగా ఎలా నియమించారు.? పార్టీ కోసం వాడుకుని ప్రభుత్వం నుంచి జీతాలు ఎందుకు ఇచ్చినట్లు.? ఈ ఓవరాల్ ఎపిసోడ్ వెనక మాస్టర్ మైండ్ ఎవరు..వాళ్లకు వంత పాడిందెవరనే దానిపై కూటమి సర్కార్ కూపీ లాగుతోందట. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అరెస్టులే కాదు..కార్పొరేషన్ల ద్వారా పార్టీ సానుభూతిపరులకు ఇచ్చినట్లు చెప్తున్న జీతాల రికవరీ కూడా చేస్తామంటున్నారు కూటమి నేతలు.