మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అదాని, అంబానీ ల ఆస్తులు వందల రెట్లు పెరిగిపోయాయని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ మోడీ అధాని,అంబానీ లకు వెసులుబాటు లు కల్పిస్తున్నారు..అదానీ స్టాక్ మార్కెట్ ను మ్యనుప్యూలెట్ చేశారని,అదానీ పై ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు..అదానీ అరెస్ట్ అయితే మన ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు..అందుకే మోడీ అదానీ పై నోరు మెదపడం లేదు..అదానీ మోసాలలో ప్రధాని కి కూడా ప్రధాన భాగస్వామ్యం ఉందని, కాబట్టి మోడీ మాట్లాడడం లేదని ఆరోపించారు.అదానీ నీ అరెస్ట్ చేయాలి.అదానీ పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేసారు.అదానీ స్కిల్ యూనివర్శిటీ కి 100 కోట్లు ఇచ్చారు..స్కిల్ యూనివర్శిటీ కి కేటీఆర్ 50 కోట్లు ఇస్తే తీసుకుంటాము..డబ్బు వ్యామోహం కన్న రాజకీయం వ్యామోహం తో చేసే పనులు చాలా డెంజర్..
అదానీ కి మేము తెలంగాణ లో గుంట భూమి కూడా ఇవ్వలేదు…అదానీ న్యాయంగా ఒప్పందాలు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు..మా ప్రభుత్వం అదానీ తో చేసుకున్న ఒప్పందాల పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ప్రకారం ముందుకు వెళతాము..చట్ట రీత్యా ఎవరు వ్యాపారం చేసిన మేము యాక్సెప్ట్ చేస్తాము…పేద ప్రజల అభ్యున్నతి మా స్టాండ్..బీజేపీ బిఆర్ఎస్ ఒక్కటే..నన్నారు.దుబాయ్ లో నేరం చేస్తే ఇక్కడ నేరం చేసినట్టు అవుతుందా..అని ప్రశ్నించారు.