ఆంధ్రప్రదేశ్ జాతీయం

మెప్పు కోసం ప్రయత్నిస్తే శిక్ష తప్పదు: రఘురామ

తప్పును తప్పుగానే చెప్పాలని హితవు

అత్యుత్సాహం ప్రదర్శిస్తే శిక్ష తప్పదని అధికారులనుద్దేశించి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించిన విషయంలో ఉన్నతాధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఆ విషయాన్ని ప్రస్తావించిన రఘురామకృష్ణరాజు.. అధికారుల తీరును తప్పుబట్టారు. నాయకుల మెప్పు కోసం ప్రయత్నించి అధికారులు ఇలాంటి తప్పు చేస్తే శిక్షలు తప్పవని చురకలంటించారు. అధికారులు ఎప్పుడైనా తప్పును తప్పుగానే చెప్పాలని ఆయన హితవు పలికారు. అనవసరంగా అత్యుత్సాహం చూపించొద్దన్నారు.