తెలంగాణ ముఖ్యాంశాలు

శ్రీశైలం, సాగర్‌కు కొనసాగుతున్న ప్రవాహం

కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయం ప్రాజెక్టుకు 1,47,634 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 1,12,047 క్యూసెక్కులుగా ఉన్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగలకు గాను ప్రస్తుతం 884.80 అడుగులుంది. గరిష్ఠ స్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు.. 214.3637 టీఎంసీల నిల్వ ఉన్నది.

కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,14,458 క్యూసెక్కులుగా ఉన్నది. ఐదు క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాయశం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 598.70 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 311.14 టీఎంసీల మేర నీరు నిల్వ ఉన్నది.