రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. సభలో గందరగోళ పరిస్థితులపై కంటతడి పెట్టిన వెంకయ్య నాయుడు.. విపక్షాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సభలో జరిగిన ఘటనలపై ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలో కూడా తెలియడం లేదు. నేను నిద్రలేని రాత్రి గడిపాను అని వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంట్ ఓ దేవాలయం వంటిది. సభ పవిత్రతను కాపాడటంలో అందరూ విఫలమయ్యారు.
మంగళవారం సభలో జరిగిన ఘటనలను పూర్తిగా ప్రజలకు చూపించాలి. కొందరు సభ్యులు టేబుల్స్‌పై ఎక్కి కూర్చోవడం బాధించింది అని వెంకయ్య అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సభను నడపలేనంటూ మధ్యాహ్నం 12 గంటల వరకూ రాజ్యసభను వాయిదా వేశారు.