నేడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుటుంబసమేతంగా శ్రీశైలానికి రానున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోన్నారు. అనంతరం అక్కడి నుంచే హెలికాప్టర్ లో శ్రీశైలంకు వెళతారు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్యలో ఆయన దర్శించుకుంటారు.
దర్శనానంతరం శ్రీశైలంలోని గెస్ట్ హౌస్ లో ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. తొలిసారిగా మల్లన్న దర్శనానికి శ్రీశైలం వస్తున్న అమిత్ షాకు స్వాగతం పలకడానికి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఏపీ దేవదాయ శాఖ కమిషనర్ వాణీ మోహన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, అమిత్ షా పర్యటనలో రాజకీయపరమైన ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడం గమనార్హం.