ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

తిరుమలలో పర్యావరణహిత సంచులు

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా డీఆర్డీవో రూపకల్పన చేసిన బయోడీగ్రేడబుల్‌ సంచులను మొదట తిరుమల పుణ్యక్షేత్రంలో అందుబాటులోకి తెచ్చారు. శ్రీవారి భక్తులు లడ్డూ, ప్రసాదాలను తీసుకెళ్లేందుకు వీలుగా ఆదివారం తిరుమలలోని లడ్డూ విక్రయ కేంద్రంలో సంచుల కౌంటర్‌ను టీటీడీ ఈవో జవహర్‌రెడ్డితో కలిసి డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఐదు లడ్డూలు పట్టే సంచి ధర రూ.2, పది లడ్డూలు పట్టే సంచి ధరను రూ.5గా నిర్ణయించారు. పర్యావరణహితమైన ఈ సంచులను జంతువులు తిన్నా ఎలాంటి హాని ఉండదని సతీశ్‌రెడ్డి తెలిపారు. మూడు నెలల్లో భూమిలో కలిసిపోయేలా సంచులను తయారుచేసినట్టు పేర్కొన్నారు.