చిత్తూరు జిల్లాల్లో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. పుత్తూరు మండలం రాచపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధతో పురుగులమందు తాగి దంపతులతో పాటు కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను శంకరయ్య (55), గురవమ్మ (45), వినయ్ (25)గా గుర్తించారు. పెద్ద కుమారుడు అప్పులు చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు తీసుకోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Chittoor | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య